ఏపీలో సిద్ధం సభలు ఒక ట్రెండ్ సెట్ చేశాయి. ప్రతి సభకు భారీ ఎత్తున, లక్షల్లో జన సమీకరణ చేయడం ఏపీలో ఇదే మొదటి సారి కావొచ్చు.  ఈ సిద్ధం సభల ద్వారా జగన్ తన ప్రత్యేకతను చాటుకొన్నారు. ర్యాంపు వాక్ ఉండేలా సభను డిజైన్ చేయడం.. అలా నడుస్తూ ప్రజల వద్దకు వెళ్లి అభివాదం చేయడం.. వంటివి మనం చూశాం.
 

జగన్ ఇప్పుడు మేమంతా  సిద్ధం అంటూ బస్సు యాత్రలకు తెరలేపారు.  విజయవాడలో తనపై రాయి దాడి జరిగినా.. నుదిటిపై గాయం మానకపోయినా బస్సుయాత్రను మాత్రం సీఎం జగన్ ఆపడం లేదు. ముఖాముఖీలు, రోడ్ షోలు, నిర్వహిస్తూనే అక్కడక్కడ బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు.  ఇడుపుల పాయలో మొదలు పెట్టిన మేమంతా బస్సుయాత్ర  ఇచ్చాపురం వరకు కొనసాగించేలా సీఎం జగన్, పార్టీ నాయకులు వ్యూహ రచన చేశారు. ఈ యాత్రలకు ఎక్కువ సంఖ్యలో వృద్దులు కనిపించడం ఆశ్చర్యాన్ని గురి చేస్తోంది. వాలంటీర్ వ్యవస్థను ఆపేయడం ద్వారా తమ పింఛన్లు అందుతాయో లేదో అని అవ్వాతాతలు ఆందోళన చెందుతున్నారు.

అందుకే వారంతా ఈ సభలకు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు.  జగన్ కి ఒక మ్యానరిజం ఉంది. ఎక్కడైనా వినతి పత్రాలు పట్టుకొని ప్రజలు కనిపిస్తే తన కాన్వాయ్ ని ఆపి మరీ వారి సమస్యలు తెలుసుకుంటూ ఉంటారు.  వారి వద్దకు నేరుగా వెళ్తారు. గుండెలకు హత్తుకుంటారు. వారికి నేను ఉన్నాను అనే ధైర్యం కల్పిస్తారు. చంద్రబాబు ఈ తరహా ప్రచారం చేయరు. ఎవరి స్టైల్ వారిది. ఇందులో తప్పు పట్టేది ఏమీ లేదు.


కాకపోతే జగన్ కి కొంతమంది మండుటెండలో నిలబడి వినతి పత్రాలు ఇస్తున్నారు. కొందరు చెప్పులేకుండా వస్తున్నారు. వీరందర్నీ జగన్ దగ్గరకు తీసుకుంటుంటే.. ఎల్లో మీడియా తట్టుకోలేకపోతుంది. ఇదంతా స్ర్కిప్ట్ లో భాగమే అంటూ వార్తా కథనాలు ప్రచురిస్తోంది. గత ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ చెట్టు కింద కూర్చొని మట్టి పాత్రలో అన్నం తిన్నప్పుడు ఆయనలో సామాన్యుడు కనిపించిన వారికి జగన్ లో ఇప్పుడు నటుడు కనిపిస్తున్నారు. ఇదేమి విచిత్రమో అర్థం కావడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: