ఏపీ సీఎం వైఎస్ జగన్ పై రాయితో దాడి జరిగిన తర్వాత ఆ దాడితో తమకు ఏ మాత్రం సంబంధం లేదని టీడీపీ ప్రచారం చేసుకుంటున్నా ఏపీ ప్రజలు మాత్రం ఘటన విషయంలో టీడీపీ పాత్ర ఉందని నమ్ముతున్నారు. జగన్ పై గులకరాయితో దాడి చేసినలో ఏ1గా ఉన్న సతీష్ బోండా ఉమతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే నాగన్న లేటెస్ట్ సర్వే ఫలితాలు తాజాగా రిలీజ్ కాగా ఈ ఫలితాల గురించి నెట్టింట చర్చ జరుగుతోంది.
 
సర్వే ప్రస్తుతం ఏపీని షేక్ చేస్తుండటం గమనార్హం. కూటమికి షాకులు తప్పవని సర్వేల ద్వారా అర్థమవుతోంది. తాజాగా వెలువడిన నాగన్న సర్వే ఫలితాలలో జగన్ ను మళ్లీ సీఎంగా చూడాలని 51.24 శాతం మంది కోరుకుంటుండగా చంద్రబాబును సీఎంగా చూడాలని 37.12 శాతం మంది కోరుకుంటున్నారు. పవన్ ను సీఎంగా చూడాలని 6.08 శాతం ఓటర్లు అభిప్రాయపడ్డారు.
 
దాదాపుగా 52 శాతం మంది ప్రజలు వైసీపీ అధికారంలోకి రావాలని ఫీలవుతున్నారు. దాదాపుగా 1,05,000 శాంపిల్స్ సేకరించి ఈ సర్వేను నిర్వహించడం గమనార్హం. 100కు పైగా స్థానాలలో విజయం సాధిస్తుందని నాగన్న సర్వే పేర్కొంది. మరో 33 స్థానాలలో మాత్రం టఫ్ ఫైట్ ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సర్వేల ఫలితాలను కొంతమంది నమ్ముతుంటే మరి కొందరు నమ్మట్లేదు.
 
రాబోయే రోజుల్లో మరికొన్ని సర్వేల ఫలితాలు విడుదల కానుండగా ఆ ఫలితాలు ఏ పొలిటికల్ పార్టీకి అనుకూలంగా ఉంటాయో చూడాల్సి ఉంది. అయితే 2019 ఎన్నికల సమయంలో చాలా సర్వేలు టీడీపీకి అనుకూలంగా వచ్చాయని ఆ సర్వేలను నమ్మితే పొలిటికల్ గా తీవ్రస్థాయిలో పార్టీలు నష్టపోవాల్సి ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ, కూటమి నేతలలో ఎవరి నమ్మకం నిజమవుతుందో చూడాల్సి ఉంది. ఎన్నికల్లో పాజిటివ్ ఫలితాల కోసం ఇష్టానుసారం నేతలు హామీలు ప్రకటిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: