ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. 164 స్థానాలు సంపాదించుకున్న తెలుగుదేశం కూటమి ఈనెల 12వ తేదీన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబుతో పాటు మరో 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే రెండు రోజుల తర్వాత.. ఎవరికి ఏ శాఖ ఇస్తారనే దానిపై క్లారిటీ వచ్చింది.
 
కాసేపటికి క్రితమే మంత్రుల శాఖలను ఫైనల్ చేశారు చంద్రబాబు నాయుడు. ఇక శాఖల కేటాయింపు ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ హోం మంత్రిగా మహిళకు ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. దీంతో వంగలపూడి అనితకు హోం మంత్రిత్వ శాఖ వచ్చింది. అటు చంద్రబాబు నాయుడు దగ్గర సాధారణ పరిపాలన శాఖ అలాగే శాంతి భద్రతలు  ఉంచుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వడమే కాకుండా పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖలు ఇచ్చారు.


అచ్చం నాయుడుకు వ్యవసాయ శాఖ ఇచ్చారు. ఇటు కొల్లు రవీంద్ర కు గనుల శాఖ, నాదెండ్ల మనోహర్ కు పౌరసరఫరాల శాఖ ఇచ్చారు. పొంగూరు నారాయణకు పట్టణ అభివృద్ధి శాఖ దక్కింది. సత్య కుమార్ కు ఆరోగ్యశాఖ...  నిమ్మల రామానాయుడు కు  జల వనరుల  శాఖ దక్కింది.నారా లోకేష్ కు మానవ వనరుల అభివృద్ధి, ఐటీ అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ ఇచ్చారు. ఫరూక్ కు మైనార్టీ సంక్షేమం, న్యాయశాఖ దక్కింది. ఆనం రామనారాయణరెడ్డికి దేవాదాయ శాఖ, పయ్యావుల కేశవ్ కు ఆర్థిక, చేనేత, శాసనసభ వ్యవహారాలు ఇచ్చారు చంద్రబాబు.  


అనగాని సత్యప్రసాద్ కు రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ అందించారు.  కొలుసు పార్థసారథికు గృహనిర్మాణం, పౌరసంబంధాలు ఇచ్చారు బాబు. డోలా బాలవీరాంజనేయస్వామికు సాంఘిక సంక్షేమ శాఖ, గొట్టిపాటి రవికు విద్యుత్ శాఖ ఇచ్చారు. బీసీ జనార్దన్ రెడ్డికి ఆర్ అండ్ బీ అందించారు. టీజీ భరత్‌ కు పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలు ఇచ్చారు. ఇక కందుల దుర్గేష్ కు పర్యావరణం, సాంస్కృతిక శాఖ ఇచ్చారు బాబు.  రాంప్రసాద్ రెడ్డికి రవాణాశాఖ, క్రీడలు ఇచ్చారు.  గుమ్మడి సంధ్యారాణికి మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ దక్కాకి.  సవితకు బీసీ సంక్షేమం దక్కాయి.  వాసంశెట్టి సుభాష్ కు కార్మిక శాఖ, కొండపల్లి శ్రీనివాస్ కు చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఇచ్చారు బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: