
ఇక గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ప్రకటనతో.. గులాబీ పార్టీ నేతలు అలాగే కార్యకర్తల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. కెసిఆర్ సభకు చాలా చక్కగా వచ్చిన కేటీఆర్.... ఒక్కరోజు గడవకముందే గాయాల పాలయ్యాడు. దీంతో కార్యకర్తలు టెన్షన్ పడుతున్నారు. తమ నాయకుడి కుమారుడికి ఏమైందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల ప్రజలు కూడా... ఆందోళన చెందుతున్నారు.
అయితే కేటీఆర్ ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో ప్రకటన చేయడంతో అన్ని పార్టీల రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు. ఏపీ నుంచి కూడా కూటమి నేతలు స్పందించడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్... స్పందించారు. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు... త్వరగా కోలు కోవాలని ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ప్రజల కోసం నిత్యం తిరిగే కేటీఆర్... కు అలా జరగడం తనను బాధించిందని వెల్లడించారు. అలాంటి నాయకులు త్వరగా కోలుకోవాలని కోరారు. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంత్రి నారా లోకేష్ కూడా... దీనిపై స్పందించారు. తన మిత్రుడు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు... గాయపడడం తనను బాధించిందని వెల్లడించారు నారా లోకేష్. కేటీఆర్ వెంటనే కోలుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.