ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నూతన వికాసం వైపు అడుగులు వేస్తోంది. ప్రతి ఆంధ్రుడు నా రాజ్యం అమరావతి అని సగర్వంగా  చెప్పుకునే  విధంగా నగర నిర్మాణం సాగబోతోందని తెలుస్తోంది. రూ:49వేల కోట్ల అభివృద్ధి పనులకు టెండర్లు ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీతో  నిర్మాణ పనులను పునః ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ఇదే తరుణంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ప్రముఖులు అందరికీ ఆహ్వానం అందింది.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలవబోతున్న అమరావతి నిర్మాణానికి  ఆహ్వానించిన వారందరూ హాజరవుతారా లేదా అనే విషయం పక్కన పెడితే మాజీ సీఎం జగన్ ఈ ప్రోగ్రాంకు వస్తారా లేదా అనేది చాలామంది మదిలో మెదులుతున్న ప్రశ్న. అమరావతి నిర్మాణం అనేది ప్రజాసేవస్సుకు కోసం జరిగేది. కానీ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో  ఈ అమరావతి నిర్మాణ పనులు పూర్తిగా కుంటుబడిపోయాయి.

 ఆయన ఒక అమరావతిని రాజధాని చేయడం పక్కనబెడితే మూడు రాజధానులు అంటూ ఆర్భాటం చేశారు. ఇందులో ఏ ఒక్క రాజదానిని కూడా పూర్తి చేయలేదు. రాజధాని వికేంద్రీకరణ పేరుతో  ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చాలా వెనక్కి తీసుకుపోయారని ప్రజల్లో చాలావరకు బాధ ఉంది. ముఖ్యంగా వైజాగ్ రాజధాని అని చెప్పి  అక్కడ ప్రజల ఓట్లను పొందాలని చూశారు కానీ  మొన్నటి ఎన్నికల్లో కనీసం సీట్లు కూడా సాధించలేకపోయాడు. కర్నూల్ న్యాయ రాజధానిగా చేద్దామని చెప్పారు. ఇదేమైనా వర్కౌట్ అయిందా అంటే కాలేదు అక్కడ వైసిపికి కంచుకోట అయినటువంటి ప్రాంతాల్లో కూడా వారి అభ్యర్థులు ఓడిపోయారు.

ఇక అమరావతి విషయంలోకి వస్తే దాన్ని పూర్తిగా పక్కన పడేశారు. ఇలా మూడు రాజధానుల పేరుతో ఐదు సంవత్సరాలు కాలం వెళ్లదీసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రజలు తీవ్ర ఆగ్రహించి చివరికి ఆయనను 11 ఎమ్మెల్యే సీట్లతో కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా కూడా చేశారని చెప్పవచ్చు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా అమరావతి నిర్మాణ అభివృద్ధి పనులకు సపోర్ట్ చేసి  ఈ వేడుకకు హాజరైతే మాత్రం ఆయనకు ప్రజల నుంచి మంచి సానుభూతి లభించి పాజిటివ్ వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: