
అయితే కొంతమంది మాత్రం ఈ విషయంలో దుకాణాదారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. అయితే బంగారం దుకాణాదారులు మాత్రం పాత బంగారంతో సంబంధం లేదని కొత్త బంగారం ఎంత కొనుగోలు చేస్తే ఆ మొత్తానికి జీఎస్టీ కట్టాలని చెబుతున్నారు. అక్షయ తృతీయ సందర్భంగా ఊహించని స్థాయిలో బంగారం కొనుగోళ్లు జరిగాయనే సంగతి తెలిసిందే. ప్రముఖ జ్యూవెలరీ షాపులు కొన్ని ఆఫర్లను సైతం ప్రకటించాయి.
బంగారం ధర అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో జీఎస్టీ గురించి ప్రజలు ప్రశ్నిస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. లక్ష రూపాయల బంగారం కొనుగోలు చేస్తే 3,000 రూపాయలు జీఎస్టీ చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. పాత బంగారం ఆభరణాలు ఇచ్చిన వాళ్లు తాము ఇచ్చిన నగల విలువపై జీఎస్టీ తీసుకోవద్దని కోరుతున్నారని వ్యాపారులు వెల్లడిస్తున్నారు.
చాలామంది బంగారాన్ని చిన్నచిన్న వ్యాపారుల దగ్గర కొనుగోలు చేస్తూ డబ్బు ఆదా చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఇలాంటి వ్యాపారుల దగ్గర కొనుగోలు చేసే బంగారం ఎంత క్వాలిటీగా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. ఎక్శ్చేంజ్ లో ఇచ్చే బంగారంపై జీఎస్టీ విషయంలో ఎలాంటి మినహాయ్ంపులు లేవని అధికారులు సైతం చెబుతున్నారు. పూర్తిగా జీఎస్టీ చెల్లించి బిల్లు తీసుకున్న వాళ్లకు భవిష్యత్తులో సైతం ఇబ్బందులు రావని వెల్లడిస్తున్నారు. బంగారం ప్రియులకు షాకిచ్చే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు ఉండటం గమనార్హం. తరచూ బంగారం కొనుగోలు చేసేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.