ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో.. పాకిస్తాన్ పై దాడి చేసింది ఇండియన్ ఆర్మీ. ఆపరేషన్ సింధూర్ పేరుతో... ఉగ్రవాదులను ఏరిపారేస్తోంది ఇండియన్ ఆర్మీ. అయితే ఇలాంటి నేపథ్యంలో... సరి హద్దుల్లో పాకి స్తాన్ వక్రబుద్ధి చూపిస్తోంది. ఎవరు ఊహించని విధంగా ఇండియన్ ఆర్మీపై పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ జరిపిన కాల్పులలో ముగ్గురు భారత పౌరులు కూడా మృతి చెందారు.

 ఎల్బోసి సమీపంలో ఉన్న గ్రామాలపై ఫిరంగులతో పాకిస్తాన్ దాడులు చేసింది. ఈ నేపథ్యంలో ఇండియాకు సంబంధించిన ముగ్గురు పౌరులు మృతి చెందారు. ఈ దాడులలో తంగారు గ్రామంలో ఓ కాశ్మీరి పౌరుడి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. అటు పాక్ కాల్పులను సమర్థవంతంగా ఇండియన్ ఆర్మీ తిప్పి కొడుతోంది. ముగ్గురు పౌరులను చంపినందుకు.. వాళ్లను కూడా చంపేందుకు... అడుగులు వేస్తోంది మోడీ ప్రభుత్వం.

 ఇది ఇలా ఉండగా ఆపరేషన్ సింధూర్  నేపథ్యంలో ఇప్పటికే వందమందికి పైగా పాకిస్తాన్ ఉగ్రవాదులను ఇండియన్ ఆర్మీ చంపేసింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల సమయం వరకు ఈ ఆపరేషన్ సిందూర్ కొనసాగే అవకాశం ఉంది. ఈ దెబ్బకు.. పాకిస్తాన్ దేశంలో... ఎమర్జెన్సీ కూడా విధించారు. విమానాశ్రయాలలో... విమానాలు కూడా ఎగరకుండా ఆంక్షలు విధించారు. ముఖ్యంగా ఈ ఆపరేషన్ దెబ్బకు పాకిస్తాన్ ప్రజలు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆ దేశంలో మెడికల్ ఎమర్జెన్సీ కూడా కొనసాగుతోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: