
మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలక నేత జగన్ తాజాగా మృతి చెందడం జరిగింది. దీంతో మావోయిస్టు పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు కీలక నిత్యం తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ అని తెలుస్తోంది. ఆంధ్రా అలాగే ఒడిశా సరిహద్దులలో జరిగిన ఎన్కౌంటర్లో మొత్తం నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు చెబుతున్నారు. ఇక ఈ నలుగురిలో మావోయిస్టు కీలక నేత జగన్ కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇతనిపై 20 లక్షల రివార్డు కూడా ఉందని చెబుతున్నారు అధికారులు. అల్లూరి జిల్లా వై రామవరం అలాగే జీకే వీధి మండలాలలో భద్రత బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు అలాగే భద్రత బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ భీకర కాల్పుల్లో మొత్తం 4 గురు మావోయిస్టులు మరణించారు... ఇందులో మావోయిస్టు కీలక నేత జగన్ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఆయనతో పాటు మరో ముగ్గురు మరణించారు. ఇక వారి నుంచి రెండు ఏకే 47 కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు