
భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా తీవ్ర ఉధృత పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం భారతదేశం లో ప్రతి ఒక్కరు యుద్ధం మూడ్ లోకి వెళ్లిపోయారు. దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం భారత ప్రజలను సైతం యుద్ధానికి అందరూ సిద్ధంగా ఉండాలని ముందస్తు జాగ్రత్తలు చెప్పడంతో పాటు హెచ్చరికలు కూడా జారీ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిరవధిక వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. గురువారం పంజాబ్ - ఢిల్లీ మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే. మళ్లీ తిరిగి ఐపీఎల్ ఎప్పుడు జరుగుతుందో క్లారిటీ అయితే ఇవ్వలేదు. బీసీ సీఐ ఇప్పటికే పాకిస్తాన్ జట్టుతో క్రికెట్ ఆడే విషయంలో మొండి పట్టుదలతో ఉన్న సంగతి తెలిసిందే. మన దేశం పాకిస్తాన్లో పర్యటించి చాలా ఏళ్లు అవుతుంది.
ఐసీసీ టోర్నమెంట్ లతో పాటు ఆసియా కప్ లాంటి టోర్నమెంట్లలో భారత్ - పాకిస్తాన్ జట్ల మధ్య కేవలం తటస్థ వేదికల మీదే మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు యుద్ధం నేపథ్యంలో బీసీసీఐ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఐపీఎల్ రసవత్తరంగా మారుతుంది. అయితే ఆటగాళ్ల భద్రత విషయంలో రాజీ పడకూడదని ఉద్దేశంతో ఐపీఎల్ లో వాయిదా వేసినట్టు బీసీసీ అధికారులు పేర్కొన్నారు. ఓవైపు దేశం యుద్ధం చేస్తుంటే ఇలాంటి సమయంలో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడం జరిగింది కాదనిపించింది అని బీసీ సీఐ ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికే పంజాబ్ - ఢిల్లీ మ్యాచ్ భద్రత కారణాల నేపథ్యంలో మధ్యలోనే రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ లక్నో - ఆర్ సి బి మధ్య లక్నోలోని ఏక నా స్టేడియంలో మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే టోర్నీ కంటిన్యూగా వాయిదా వేసినా ఇప్పట్లో జరుగుతుందన్న నమ్మకాలు లేవు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు