ఛత్తీస్గడ్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఇందులో ఏకంగా 13 మంది మరణించగా 30 మందికి పైగా గాయాలైనట్లుగా తెలుస్తోంది.. పెళ్లి వేడుకకు వెళ్లి మరి తిరిగి వస్తూ ఉండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మృతులలో ఎక్కువ శాతం మంది మహిళలే ఉన్నారని వీరితో పాటు నలుగురు చిన్నారులు కూడా ఈ ప్రమాదంలో మరణించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రమాదం ఛత్తీస్గడ్ రాష్ట్రంలో రాంపూర్ బలోదబజార్ రోడ్డు సమీపంలో జరిగినట్లుగా పోలీసులు తెలియజేస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామునే ఈ సంఘటన జరిగిందట.


పోలీసులు తెలుపుతున్న వివరాలు ప్రకారం చట్టౌడ్ గ్రామానికి చెందిన కొంతమంది తమ కుటుంబ సభ్యుల వివాహ వేడుకలలో పాల్గొని తిరిగి తమ గ్రామానికి వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగిందట.  వివాహం పూర్తి అయ్యాక ఒక వాహనంలో రాయ్ పూర్ కు బయలుదేరారట. వారు ప్రయాణిస్తున్న వాహనం బలోదా బజార్ రోడ్డు ప్రాంతానికి రాగానే ఆ సమీపంలో వేగంగా వచ్చిన ఒక ట్రక్  ఈ వాహనాన్ని ఢీ కొట్టిందట. దీంతో ఈ ప్రమాదంలో 13 మంది పైగా మృతి చెందారని 30 మంది పైగా గాయాలయ్యాయని తెలియజేశారు.


ఏ సంఘటన సమాచారం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నామని దగ్గర్లోని హాస్పిటల్ కి క్షతగాత్రులను తరలించారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి కూడా విషయంగానే ఉన్నట్లు తెలియజేశారు. దీంతో మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నదంటూ వైద్యులు తెలియజేశారట. మృతులలో 9 మంది మహిళలతో పాటు నలుగురు చిన్నపిల్లలు ఉన్నట్లుగా అక్కడ జిల్లా ఎస్పీ తెలియజేశారు. ఈ ఘటన కేసు నమోదు చేసి మరి దర్యాప్తు చేయబోతున్నట్లు ఎస్పీ లాల్ ఉమెన్ సింగ్ వెల్లడించారు. ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో రాయ్ పూర్ ప్రాంతంలో  విషాద ఛాయలు నెలకొన్నాయి. మరి ప్రభుత్వం ఏదైనా వీరికి సహాయం చేస్తూనేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: