ఆపరేషన్ సిందూర్‌ దెబ్బకు పాకిస్తాన్ మూడు రోజుల్లోనే కాళ్ల బేరానికి వచ్చిందని ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ తెలిపారు. సింధూర్ స్టార్ట్ అయ్యాక ఆయ‌న తొలిసారి జాతిని ఉద్దేశించి చేసిన ప్ర‌సంగంలో పాక్‌ను అవ‌స‌రం అయితే అంతం చేస్తామ‌ని ఘాటు వార్నింగ్ ఇచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉగ్ర‌వాదుల‌పైనే మ‌న సైన్యం దాడి చేసింద‌ని కానీ పాకిస్తాన్ ఉగ్ర‌వాదానికి మ‌ద్ద‌తుగా ఉంటూ మ‌న‌పై ఎదురు దాడి చేస్తోంద‌ని.. పాక్‌కు నేరుగా బుద్ధి చెప్ప‌డంతో మ‌న కాళ్ల భేరానికి వ‌చ్చింద‌ని మోదీ ధ్వ‌జ‌మెత్తారు. ఇక ఉగ్ర‌వాదం, చ‌ర్చ‌లు రెండూ ఒకేసారి ఉండే అవ‌కాశం లేద‌న్న మోడీ పాక్‌తో చ‌ర్చ‌లు అంటూ జ‌రిగితే ఉగ్ర‌వాదం, పీవోకే అంశంపైనే అని చెప్పారు. పాకిస్తాన్ మిస్సైల్స్ అన్నీ మన రక్షణ వ్యవస్థల ముందు తేలిపోయాయని మనం మాత్రం పాకిస్తాన్ గుండెల్లో బాంబులు పేల్చామన్నారు.


పాక్ త‌ర్వాత చ‌ర్య‌ల‌పై సైతం ఓ క‌న్నేసి ఉంచామ‌ని.. అణుదాడి చేస్తామని బెదిరిస్తే సహించేది లేదన్నారు. పాక్ తోక జాడిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. భార‌త్ దాడుల‌కు త‌ట్టుకోలేకే మే 10న పాకిస్తాన్ డీజీఎంవో భారత్ ను సంప్రదించిందని మోదీ చెప్పారు. అయితే తాము అప్ప‌టికే పాక్‌లోని ఉగ్ర‌మూక‌ల‌ను తుద‌ముట్టించామ‌ని... ఆప‌రేష‌న్ సింధూర్‌ను నిలిపి వేశామ‌ని.. పాక్ త‌ర్వాత చ‌ర్య‌ల‌ను బ‌ట్టి మ‌న రియాక్ష‌న్ ఉంటుంద‌ని మోదీ తెలిపారు. పాక్ అణ్వాయుధాలను అడ్డం పెట్టుకుని ఉగ్రవాదానికి పాల్పడతామని అంటే చూస్తూ ఊరుకోమ‌న్నారు. అమెరికా మధ్యవర్తిత్వంతో సహా ఇతర అంశాలపై ప్రధాని మోదీ ఎలాంటి ప్రస్తావన చేయలేదు. అయితే కశ్మీర్ పై ఎవరి మధ్యవర్తిత్వం ఉండదని.. పీవోకే విషయంలో మాత్రమే చర్చలు జరుపుతామని మోదీ తెలిపారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: