రాష్ట్రంలో చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఏపీ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. చేనేత కార్మికులు నిలదొక్కుకునే దిశగా చ‌ర్య‌లు తీసుకుంటుంది. తాజాగా ప్రభుత్వం నుంచి మరో తీపి కబురు వెలువడింది. వచ్చే నెల నుంచి చేనేత కార్మికులకు ఆరోగ్య భీమా పథకాన్ని అమలు చేయబోతున్నట్టు చేనేత జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడించారు. బుధవారం విజయవాడలో చేనేత సంఘాల ప్రతినిధులతో సవిత సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు.


చేనేత రంగాన్ని గ‌త వైసీపీ ప్ర‌భుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింద‌ని స‌విత దుయ్య‌బ‌ట్టారు. వైసీపీ హ‌యాంలో క్రియాశీలత కోల్పోయిన చేనేత సంఘాలకు కూట‌మి ప్ర‌భుత్వంలో పూర్వవైభ‌వం రాబోతుందన్నారు. వ‌చ్చే నెల నుంచి చేనేత కార్మికుల కోసం ఆరోగ్య బీమా పథకాన్ని అమ‌లులోకి తెస్తామ‌ని వెల్ల‌డించారు. అలాగే దసరా నాటికి చేనేత సహకార సంఘాల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల చేయ‌నున్నట్లు స‌విత పేర్కొన్నారు.


వారానికి ఒక‌సారి ప్రభుత్వ ఉద్యోగులు చేనేత వస్త్రాలు ధరించే విధంగా ప్ర‌భుత్వం పాల‌సీని రూపొందించే ఆలోచ‌న‌లో ఉంద‌ని.. త్వ‌ద్వారా చేనేత కార్మీకుల‌కు చ‌క్క‌ని ప్రోత్సాహం  ల‌భించిన‌ట్లు అవుతుంద‌ని స‌విత అన్నారు. రాష్ట్రంలో చేనేత మగ్గాలు కలిగిన వారంద‌రికీ ఉచిత‌ క‌రెంట్ ను త్వరలో అమలు చేస్తామని, అర్హులకు వర్క్‌షెడ్లను మంజూరు చేస్తామ‌ని స‌విత హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇక నుంచి ప్ర‌తి 3 నెలలకొకసారి ఇర‌వై శాతం పెంచిన ధరలకు ఆప్కో సంస్థ స్వ‌యంగా చేనేత సంఘాల నుంచి వస్త్రాలను కొనుగోలు చేస్తుందని మంత్రి స‌విత పేర్కొన్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: