ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, వైఎస్ జ‌గ‌న్ ఫ్యామిలీకి క‌డ‌ప కంచుకోట‌. ఆ కంచుకోట ఇప్పుడు కూలుపోతుందా..? జగన్ సొంత నియోజకవర్గంలో ఫ్యాన్ రెక్కలు ఒక్కొక్కటిగా ఊడి పడుతున్నాయా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. నిన్న‌టికి నిన్న వైఎస్ కుటుంబానికి స‌న్నిహితుడు, కడప నగర వైసీపీ మేయర్ సురేష్ బాబుపై కూట‌మి స‌ర్కార్ అనర్హత వేటు వేసింది. సురేష్ బాబు మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించిన‌ట్లు విజిలెన్స్ అధికారులు విచారణలో తేల్చడంతో.. ఆయ‌న పోస్ట్ ను ఊస్ట్ చేసి పెద్ద షాక్ ఇచ్చింది.


ఇది జ‌రిగిన కొన్ని గంట‌ల్లోనే వైసీపీకి క‌డ‌ప‌లో మ‌రో ఝ‌ల‌క్ త‌గిలింది. మైదుకూరు మున్సిప‌ల్ ఛైర్మ‌న్ చంద్ర ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టన చేశారు. కొద్ది రోజుల నుంచి చంద్ర వైసీపీతో అంటీముట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు కూడా దూరంగా ఉంటున్నారు. తాజాగా జ‌గ‌న్‌ కు, ఆయ‌న పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈ సంద‌ర్భంగా చంద్ర ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.


గ‌త మూడు నెల‌ల నుంచి జ‌గ‌న్ ను క‌ల‌వాల‌ని ఎంత ప్ర‌య‌త్నించినా కుద‌ర్లేద‌ని.. ఆయ‌న‌తో మాట్లాడించాల‌ని మాజీ ఎమ్మెల్యేను ఎన్ని సార్లు కోరినా ప‌ట్టించుకోలేద‌ని చంద్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఇక భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ‌పై అనుచ‌రుల‌తో చ‌ర్చించిన నిర్ణ‌యం తీసుకుంటాన‌ని చంద్ర పేర్కొన్నారు. అయితే వైసీపీని వీడిన చంద్ర చూపు టీడీపీ, జ‌న‌సేన పార్టీల వైపు ఉన్న‌ట్లు స‌మాచారం అందుతోంది. రెండింట్లో ఏదో ఒక పార్టీలో ఆయ‌న చేర‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: