
కల్వకుంట్ల కవిత గులాబీ పార్టీపై సంచలన కామెంట్లు చేశారు. గులాబీ పార్టీ గతంలో లాగా లేదని కేసీఆర్ కు ఐదు పేజీల లేఖను రాసి వివాదానికి తెరలేపారు. గులాబీ పార్టీ ఒకప్పటిలాగా ఇప్పుడు లేదని కవిత అన్నారు. గులాబీ పార్టీలో చాలా రకమైన మార్పులు చేయాలని తన తండ్రికి లేఖ ద్వారా వెల్లడించారు. మీరు కాంగ్రెస్ పార్టీ పైనే దృష్టిని పెడుతున్నారని కవిత వెల్లడించారు. బిజెపి పార్టీని ఏమి అనకపోవడం వల్ల గులాబీ పార్టీ, బిజెపి పార్టీ రెండు కలిసిపోయాయని జనాలు అనుకుంటున్నారు డాడీ అని కవిత అన్నారు. వరంగల్ లో ఏర్పాటు చేసిన సభలో మీరు ఒక్కరే మాట్లాడారు. అలా మీరు ఒక్కరే కాకుండా పార్టీలో ఉన్న సీనియర్ లీడర్లు అందరితో మాట్లాడిస్తే చాలా బాగుండేది సభ ఇంకా హైలైట్ గా నిలిచేది.
గత కొన్ని సంవత్సరాల నుంచి గులాబీ పార్టీలో ఉన్న నేతలను మీరు పెద్దగా పట్టించుకోవడంలేదని చాలామంది అనుకుంటున్నారు. దీనిపైన మీరు ఫోకస్ చేయాలి అని కవిత లేఖ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. దీంతో కవిత ఈ లేఖపై తాజాగా క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ దేవుడు కానీ కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు తిరుగుతూ ఉన్నాయని కవిత వెల్లడించారు. అలాంటి వారి వల్ల బిఆర్ఎస్ పార్టీకి చాలా నష్టం జరుగుతుందని అన్నారు.
కవిత అంతరంగికంగా కెసిఆర్ కు ఈ లేఖ రాసినప్పటికీ అది కాస్త బహిర్గతం కావడంతో పార్టీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ప్రతి ఒక్కరు పడ్డారు. కల్వకుంట్ల కవిత రాసిన ఈ లేఖపై కేటీఆర్ సీరియస్ అయ్యారు. గులాబీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కెసిఆర్ కు లేఖలు రాయవచ్చు కానీ ఇలా కవిత తరహాలో ఉన్న లోపాలు, తప్పిదాలను బయటకు చెప్పవద్దు. అలాంటి లేఖలు రాయవద్దు అని కేటీఆర్ అన్నారు. అలా రాసిన వారిపై చర్యలు ఉంటాయని చెప్పకనే చెప్పేశాడు.
అంతేకాకుండా కవిత మాట్లాడిన దయ్యాల కామెంట్లపై కూడా కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. తెలంగాణలో ఉన్నది రేవంత్ రెడ్డి అని ఒకే ఒక్క దయ్యం మాత్రమేనని అన్నాడు. గులాబీ పార్టీలో ఎలాంటి దయ్యాలు లేవని కేటీఆర్ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం కవిత చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనాలు సృష్టిస్తున్నాయి. కూతురు అయ్యుండి తండ్రి మీద ఇలా కామెంట్లు చేయడం ఏంటని అంటున్నారు. కాగా కవిత దృష్టిలో కేటీఆర్, హరీష్ ఇద్దరు దెయ్యాలు అంటూ కాంగ్రెస్ , బీజేపీ నేతలు అంటున్నారు.