
అసలు పేరు ఎలా వచ్చిందంటే ?
మహానాడు అనేది చాలా చిత్ర విచిత్రమైన పదం ! ఈ పేరు ఎలా వచ్చిందని విషయంపై చాలామంది ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తారు .. మహా అంటే ( చాలా గొప్పది ) అని అర్థం వస్తుంది .. నాడు అనే పదానికి రోజు , పర్వదినం అనే సమాధాన అర్ధాలు ఉన్నాయి .. ఈ విధంగా చూసుకుంటే మహానాడు అంటే .. చాలా గొప్ప రోజు .. అని అర్థం వచ్చింది .. దీనినే అన్నగారు ఖరారు చేశారు .. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రత్యేకగా .. తెలుగువారి ఆత్మగౌరవాని ఢిల్లీ వరకు వినిపించిన ఆయన తన పుట్టినరోజు నాడే పార్టీకి నిజమైన పండగ భావించారు .. అందుకే మహానాడు ( అయితే దీనిని ఓ పత్రిక యజమాని సూచించారని కూడా అంటారు ) ను అప్పటినుంచి నిర్వహిస్తూ వస్తున్నారు .
తొలిసారి ఎక్కడంటే ..
మొదటిసారి మహానాడు ను విజయవాడ లోని కృష్ణ నది తీరంలో .. 1983 మే 28 , 29 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించారు.. అలా మొదలైన ఈ సంబరం తర్వాత .. పార్టీ నాయకుల అభ్యర్థనల మేరకు మూడు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు .. అయితే దీనిని కూడా మే 28 కి ముందు తర్వాత నిర్ణయించడం ఇక్కడ గొప్ప విషయం .. ఇక మహానాడు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న కొన్ని కారణాలతో .. పలుసార్లు వాయిదా వేశారు .. ఇక 1985లో నాదెండ్ల భాస్కరరావు సృష్టించిన వివాదం కారణంగా .. 91 లో ఒకసారి , 96లో మరోసారి వాయిదా పడింది.. అలాగే 2012లో రాష్ట్ర విభజన కారణంగా కూడా వాయిదా వేశారు .. అలానే కరోనా సమయంలో డిజిటల్ మహానాడుగా నిర్వహించారు .. 2019 ఎన్నికల ఓటమి సమయంలో కూడా మహానాడు జరగకపోవడం గమనార్హం.