పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం కన్నప్ప. ఈ సినిమాలో మంచు విష్ణు హీరోగా నటించిన ప్రభాస్ కన్నప్ప సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాకు మంచు మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరించగా.... ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇందులో విష్ణు సరసన హీరోయిన్ గా ప్రీతి ముకుందన్ నటించింది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ కేవలం కీలకపాత్రను మాత్రమే పోషించాడు. అంతేకాకుండా అతి తక్కువ సమయం మాత్రమే సినిమాలో కనిపించనున్నారు. ఈ విషయంపై ప్రభాస్ అభిమానులు కాస్త ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.


సినిమా జూన్ 27వ తేదీన రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే కన్నప్ప సినిమాకు ఊహించని పరిణామం ఎదురైంది. కన్నప్ప సినిమాకు సంబంధించిన కీలకమైన గ్రాఫిక్ డేటా ఉన్న హార్డ్ డ్రైవ్ కనిపించకుండా పోయింది. ముంబై నుంచి HD కొరియర్ రాగా ఎవరికి తెలియకుండా చూడని సమయంలో ఆఫీస్ బాయ్ రఘు తీసుకెళ్లి చరిత అనే మహిళకు అప్పగించారు. హార్డ్ డ్రైవ్ విషయం గురించి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

వెంటనే పోలీసులకు సమాచారం అందించగా నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు. హార్డ్ డ్రైవ్ లో ప్రభాస్ కు సంబంధించిన సీన్లు, యాక్షన్ సన్నివేశాల డేటా ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. ఈ విషయం తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పని మనోజ్ కి సంబంధించిన వ్యక్తి చేసి ఉంటాడని కొంతమంది నెటిజన్లు ఆరోపిస్తున్నారు. మంచు కుటుంబంలో గత కొన్ని రోజుల నుంచి విభేదాలు, గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తన అన్న మీద కోపంతోనే మనోజ్ ఈ పనిని చేయించి ఉంటారని కొంతమంది అంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: