
తాజాగా తెలంగాణలో కెసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత తన తండ్రికి లేఖ రాసిన విషయం ఇప్పుడు పార్టీలో అంతర్గతంగా కూడా తీవ్ర ప్రకంపనలు రేపుతుంది. ఈ క్రమంలోనే ఆమె తన సోదరుడు కేటీఆర్ ను సైతం గట్టిగ టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. మా నాన్నకు తాను లేఖ రాస్తే తప్పేంటి ? అయినా నీకు నొప్పి ఏందిరా బై అన్నట్టు ఎమ్మెల్సీ కవిత ఏకంగా కేటీఆర్ ని ప్రశ్నిస్తున్నారు. గురువారం ఆమె మీడియాతో ఇష్టా గోష్టి గా మాట్లాడుతూ తనకు నీతులు చెబుతున్న బిఆర్ఎస్ పార్టీ నేతలు తెలంగాణ ప్రయోజనాల కోసం దృష్టి పెట్టాలని చురకలు అంటించారు. కేసీఆర్ నిడలో పనిచేస్తున్న వారు తనపై ప్రతాపం చూపిస్తున్నారు అంటూ ఆమె మండిపడ్డారు. దమ్ముంటే కేసీఆర్ కి నోటీసులు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి , బిజెపి పై మీ ప్రతాపం చూపించాలంటూ ఈ సందర్భంగా పార్టీ నేతలకు ఆమె సవాల్ విసిరారు. తాను అసలే మంచి దానివి కాదని తాను నోరు విప్పితే తట్టుకోలేరని ఆమె బీఆర్ఎస్ నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేయకుండా ట్విట్టర్లో మెసేజ్ లు పెడితే సరిపోతుందా ? అంటూ కూడా ఆమె ప్రశ్నించారు. పైగా తనను రేవంత్ రెడ్డి కోవర్టు అనడం కరెక్టేనా ? అని నిలదీశారు. కవిత మాట్లాడిన మాటలు చూస్తే ఆమె మొత్తం తన సోదరుడు కేటీఆర్ ను టార్గెట్ గా చేసుకుని మాట్లాడినట్టు కనిపిస్తుందని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. అంతటితో ఆగని ఆమె బిజెపికి బీఆర్ఎస్ ని అప్పగించే ప్రయత్నం జరుగుతోందని అభిప్రాయపడ్డారు. తనను కాంగ్రెస్ కోవర్టు అని అన్నారు ... మరి బిఆర్ఎస్ లో కూడా బిజెపి కోర్టులు ఉన్నారు అనుకోవాలా ? అని సందేహం వ్యక్తం చేశారు. తాను జైలులో ఉండగా బీఆర్ ఎస్ ను బీజేపీకి అప్పగించే ప్రయత్నం చేయవద్దు అని కేసీఆర్‌తో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఏది ఏమైనా తన అన్న కేటీఆర్ తో కవితకు తీవ్రమైన విభేదాలు ఉన్నాయని ... అందుకే కేటీఆర్ ను గట్టిగా టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోందని అంటున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు