ఆంధ్రప్రదేశ్లో నిత్యం రాజకీయాలలో ఏదో ఒక విషయం హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది.ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ముగ్గురు భార్యలు ఉన్నారంటూ తాజాగా సిపిఐ నేత కే.నారాయణ ఘాటు విమర్శలు చేయడంతో ఒక్కసారిగా ఏపీ అంతట ఈ విషయం చర్చినియంశంగా మారుతున్నది. గతంలో ఇలాంటి విమర్శలే వైయస్ జగన్మోహన్ రెడ్డి చేయగా.. సిపిఐ నేత ఇలాంటి విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారంటూ నిలదీయడం జరిగింది.అయితే ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలే ఈయన మాట్లాడడంతో చాలామంది నిలదీస్తూ ఉన్నారు. ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన ఒక సాంస్కృతిక కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.


సనాతన ధర్మం అంటూ పవన్ కళ్యాణ్ కొత్తవేషం వేయడమే కాకుండా అందుకు కారణాన్ని కూడా తెలియజేశారు.. సనాతన ధర్మంలో విడాకులు ఉండవు.
కానీ ఎప్పుడు వాటి గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలను ఎందుకు చేసుకున్నారు అంటూ ప్రశ్నించారు?.. సనాతన ధర్మాన్ని విమర్శిస్తే జైలులో వేయాలని పవన్ కళ్యాణ్ పదేపదే చెబుతూ ఉంటారు ఆ లెక్కన మొదట తననే జైల్లో వేయాల్సింది అంటూ తెలిపారు. సనాతన ధర్మంలో సతి సహగమనం ఉంటుంది మరి ఆ విషయాన్ని ఆయన ఒప్పుకుంటారా అంటూ నిలదీశారు?.


అయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సిపిఐ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో జనసేన పార్టీ కార్యకర్తలు ,అభిమానులు విమర్శిస్తూ ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఈయన పైన పలు రకాలుగా కామెంట్స్ చేస్తు ఏకిపారేస్తున్నారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ పైన ఘాటు వ్యాఖ్యలు చేసిన సిపిఐ నేత ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యల పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో మరి జనసేన నేతలు ఏ విధంగా కౌంటర్లు వేస్తారో చూడాలి.  పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: