
తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు ఆ పార్టీలో ఎవరు పెదవి దాటి ఒక మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడరు అన్న టాక్ ఉంది. అయితే ఇటీవల కాలంలో నేతల ధోరణి మారింది. తమకు పదవులు రాలేదని పార్టీలో ప్రయారిటీ లేదని ఎవరికి వారు ఓపెన్‌గానే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీనియర్లుగా దశాబ్దాల పాటు రాజకీయాలలో ఉండి మంత్రులుగా పనిచేసిన వారు సైతం ఈరోజు సాధారణ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. అది వారికి ఏమాత్రం మింగుడు పడటం లేదు. ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా మొత్తం మీద వంగలపూడి అనితకు మాత్రమే మంత్రి పదవి దక్కింది. మాడుగుల ఎమ్మెల్యే మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఇటీవల మహానాడు వేదికగా ఎమ్మెల్యేగా ఏడాదికాలం పూర్తవుతున్న తన నియోజకవర్గంలో ఒక అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేకపోయానని వాపోయారు.
ఆయనకు మంత్రి పదవి రాలేదని కనీసం నామినేటెడ్ పదవి కూడా లేదని బాధపడుతున్న పరిస్థితి. మరో సీనియర్ నేత మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా మినీ మహానాడు సాక్షిగా అధికారులలో అవినీతి .. అక్రమాలు పెరిగిపోయాయని వాపోయారు. తనకు ఎమ్మెల్సీ ఇవ్వలేదన్న బాధ ఉందని .. తన కుమారుడికి నామినేటెడ్ పదవి కూడా ఇవ్వలేదని ఆవేదన ఆయనలో ఉంది. ఇక మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు కూడా ఎలాంటి ప్రాధాన్యం లేదు. కేవలం ఎమ్మెల్యేగా మిగిలిపోయాను అన్న అసంతృప్తి ఉంది. ఇక కిమిడి కళా వెంకట్రావు - అశోక్ గజపతిరాజు లాంటి సీనియర్లు సైతం తీవ్ర నిరాశ తో ఉన్నట్టు ఉత్తరాంధ్ర తెలుగుదేశం వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు