
కుప్పం పట్నం వైపు వేగంగా వస్తున్న ఒక స్కార్పియో ని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద పోలీసులకు కనిపించింది. ఆ వెహికల్ లోనే దొంగల గ్యాంగ్ ఉందని నిర్ధారించుకున్న పోలీసులు ఆపడానికి ప్రయత్నించారు.. అందులోని దొంగల ముఠా వాహనాన్ని ఆపకపోవడంతో పాటుగా.. ఆవాహనంతోనే తొక్కించబోయారు. అయితే వెంటనే అప్రమత్తమైన కుప్పం రూరల్ సిఐ మల్లేష్ యాదవ్ వెళ్తున్న వాహనం పైన రెండు కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పులలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారని.. కానీ ఆ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెనక్కి మళ్ళించి తిరుపత్తూరు మార్గంలోకి తిప్పారు.
పోలీసులు మరొక వాహనంలో దొంగలని వెంబడించగా.. వేగంగా వెళ్లిన ఆ దొంగల వాహనం చివరికి పరమ సముద్రం చెరువుగట్టు మీద పోలీసులకు కనిపించింది.. అయితే అక్కడే వాహనాన్ని వదిలిపెట్టి దొంగలు పరారయ్యారు. వాహనంలో డ్రైవర్ తో పాటు సుమారుగా 5 మంది దొంగల ముఠా ఉన్నట్లుగా గుర్తించారు. డీఎస్పీ పార్థసారధి డైరెక్షన్లు కుప్పం రూరల్ సిఐ మల్లేష్ యాదవ్, అర్బన్ సీఐ శంకరయ్యతో కుప్పం డివిజన్ సిబ్బందితో మంగళవారం రాత్రి నుంచి దొంగల ముఠా గురించి చాలా విస్తృతంగా గాలిస్తూ ఉన్నారు. నిన్నటి రోజున కూడా ఈ గాలింపు కొనసాగింది.. త్వరలోనే ఈ గ్యాంగ్ మొత్తాన్ని పట్టుకుంటామంటూ పోలీసులు తెలియజేశారు. మరి కుప్పం ప్రజల కోసం చంద్రబాబు ఎలాంటి రక్షణ కల్పిస్తారో చూడాలి.