
నటసింహం నందమూరి బాలకృష్ణ అటు వెండి తెరమీద ఇటు బుల్లితెర మీద అటు రాజకీయ తెర మీద తనకు ఎదురు లేకుండా దూసుకుపోతున్నారు. వెండితెరపై నాలుగు వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాలు తో కెరీర్ లోనే తిరిగిలేని ఫామ్ లో ఉన్న బాలయ్య బుల్లితెరపై కూడా ఈ తరం జనరేషన్ కు కనెక్ట్ అవుతూ దూసుకుపోతున్నారు. ఇక రాజకీయ విషయానికి వస్తే ఇక్కడ కూడా బాలయ్య హ్యాట్రిక్ విజయాలతో సత్తా చాటుతున్నారు. 2014లో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన బాలయ్య తన తండ్రి ప్రాథినిత్యం వహించిన హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైసీపీ నుంచి పోటీ చేసినా నవీన్ నిశ్చల్‌పై 17,000 మెజార్టీతో ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2019లో రాష్ట్ర అంతటా వైఎస్ జగన్ ప్రభంజనం వీచినా తెలుగుదేశం పార్టీకి చెందిన మహామహులు చిత్తుచిత్తుగా ఓడిపోయిన హిందూపురంలో మాత్రం బాలయ్య రెండోసారి విజయం సాధించారు. దీంతో పాటు తన మెజార్టీ పెంచుకొని 18 వేల ఓట్లతో విజయం సాధించారు.
ఇక 2024 ఎన్నికలలో బాలయ్య వరుసగా మూడోసారి విజయం సాధించారు ఈసారి బాల్య మెజార్టీ ఏకంగా 33 వేలకు పెరిగింది. బాలయ్య కోసం జగన్ మూడు ఎన్నికలలోను ముగ్గురు ప్రత్యర్థులను మార్చినా ఓడించలేకపోయారు. 2014లో బలిజ నేతను, 2019లో మైనార్టీ అస్త్రం ప్రయోగించి మహమ్మద్ ఇక్బాల్‌ను రంగంలోకి దించిన పని అవలేదు. గత ఎన్నికలలో బీసీ మహిళ + రెడ్డి భర్త ఉన్న దీపికను రంగంలోకి దించిన కూడా బాలయ్య వరుసగా మూడోసారి విజయం సాధించారు. ఏది ఏమైనా హిందూపురంలో రాజకీయంగా బాలయ్య తిరుగులేకుండా దూసుకుపోతున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు