ఉపాధి హామీ పని చేసే వారికి తాజాగా ఏపీ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ తెలియజేస్తూ తగిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ పనుల కోసం ఏకంగా రూ .176.35 కోట్ల రూపాయల నిధులను సైతం విడుదల చేస్తూ అనుమతులను ఇచ్చింది. 2025- 26  ఏడాదిలో మొదటి విడతగా ఈ నిధులను కేంద్రం మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. ఉపాధి హామీ పనుల కోసం  విడుదల చేసిన ఈ డబ్బులను ఉపాధి హామీ పనులకు మాత్రమే వినియోగించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.


ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నుంచి పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ కూడా ఉత్తర్వులను జారీ చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేస్తున్న కార్మికులను సైతం మేలు చేసేలా ఇలాంటి కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. అయితే వీరి రోజు వారి వేతనం రూ .307 రూపాయలకు పెంచినట్లుగా తెలిపారు. కార్మిక దినోత్సవం పురస్కరించుకొని అమరావతిలో నిర్వహించినటువంటి ఉపాధి శ్రామికుల ఆత్మీయ కలయికలలో  భాగంగా  భీమా పరిహారాన్ని కూడా ప్రకటించడం జరిగింది.


ఎవరైనా ఉపాధి హామీ పని చేస్తున్న సమయంలో ఆ ప్రాంతంలో ప్రమాదవశాత్తు మరణించిన లేకపోతే ఏదైనా అంగవైకల్యానికి గురి అయినా కుటుంబ సభ్యులకు ఈ బీమా వర్తిస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది. అయితే ఇప్పటివరకు గరిష్టంగా 50 వేల రూపాయలు ఉండగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని రూ.4లక్షల రూపాయలకు పెంచినట్లు అందుకు తగ్గ నిర్ణయం తీసుకున్నది. రాబోయే రోజుల్లో కూడా ఉపాధి హామీ పనిచేసే వారికి అన్ని సదుపాయాలను కల్పించే విధంగా ప్లాన్ చేస్తూందట. దీంతో అటు ఉపాధి హామీ పని చేసే వారు సంతోషాన్ని తెలియజేస్తూ ఏపీ ప్రభుత్వం పైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: