
వైఎస్ కూతురు, ఒక మహిళ అని కూడా చూడకుండా కించపరిచారని షర్మిల వెల్లడించారు. జగన్ అందరినీ నా అక్కాచెల్లెళ్లు అని అంటారని కానీ ఆయన సొంత చెల్లికే మర్యాద లేదని ఆమె పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలోని మహిళలను ఏం గౌరవిస్తారని విమర్శలు చేయడం ఏంటని వెల్లడించడం హాట్ టాపిక్ అవుతోంది.
పార్టీలో కొంతమంది తీరు విషయంలో షర్మిల అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ మహా సముద్రమని ఈ పార్టీలో మంచితో పాటు చెత్త కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. పార్టీ అభివృద్ధి చెందుతుంటే కిందికి లాగేవాళ్లు సైతం ఉంటారని షర్మిల కామెంట్లు చేశారు. వాళ్లే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు సైతం చేస్తున్నారని షర్మిల అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.
పార్టీకి క్రమశిక్షణ కమిటీ ఉందని అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని సొంత పార్టీపై దుష్ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని షర్మిల వెల్లడించారు. షర్మిల వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. షర్మిల ఏపీ రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే. షర్మిల ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు