
దీనికి తగ్గటే ఇంట్లో మూడు రూమ్ లు ఉంటే మూడు రూమ్‌స్ లో ఏసి పెట్టుకుంటున్నారు. ఇలాంటి క్రమంలోనే ఎయిర్ కండిషనర్ పై కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ తీసుకురాబోతుంది. ఈ మధ్యకాలంలో ఎవరు చూసినా సరే ఇంట్లో ఏసి ని ఎక్కువగా వాడేస్తున్నారు. భారీగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల వేడికి తట్టుకోలేక ఈఎంఐలో ఏసీలు కొనుక్కొని చల్లగా సేదతీరాలి అని అనుకుంటున్నారు . ఈ క్రమంలోనే ఎయిర్ కండిషనర్ ల వాడకం ఎక్కువైపోయింది. దీనిపై ప్రభుత్వం కొత్త రూల్ తీసుకురాబోతుంది. విద్యుత్ వినియోగాన్ని భారీగా తగ్గించే చర్యల్లో భాగంగా ఏసీ టెంపరేచర్ కు పరిమితి విధించబోతున్నట్లు తెలుస్తుంది .
కనిష్టంగా 20 డిగ్రీ సెల్సియస్ నుంచి గరిష్టంగా 28 డిగ్రీల మధ్య ఉండేలా నిబంధనలు సవరించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ విషయాన్ని మనోహర్ లాల్ ఘట్టర్ ప్రకటించారు. త్వరలోనే దీనిని అమలు చేస్తామని కూడా తెలియజేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏసీలలో కనిష్టంగా 16 డిగ్రీలు 18 దగ్గర టెంపరేచర్ లో ఉన్న ఎయిర్ కండిషనర్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి . కేంద్రం అమలు చేసిన నిర్ణయంతో ఇకపై అన్ని ఏసీలలో కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీ నుంచి ప్రారంభం కాబోతుంది . నిజానికి ఏసీలు 24 మధ్య వినియోగిస్తే చాలా విద్యుత్ ఆదా అవుతుంది అని నిపుణులు ఎప్పటినుంచో చెప్పుకొస్తున్నారు. ఇలా ఉపయోగిస్తే ఇక పై కరెంట్ ఎక్కువుగా ఆదా చేసిన్నట్లే..!