ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి.. ఆ రాష్ట్రంలో వరుసగా ఏ పార్టీ కూడా మూడుసార్లు అధికారంలోకి రాలేదు.. ఓసారి టిడిపి అధికారంలోకి వస్తే మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుంది. ఇలా  ఐదు సంవత్సరాలకు ఒకసారి పార్టీలను మారుస్తూ ఉంటారు ప్రజలు.. ఆ విధంగానే  ఈసారి జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. వైసిపి కనీసం  ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. ఇలా కొనసాగుతున్న తరుణంలో కనీసం ప్రజల వైపున ప్రశ్నించడంలో కూడా వైసీపీ విఫలమవుతున్నారని చెప్పవచ్చు. ఇక జగన్ వైఖరి నచ్చనటువంటి చాలామంది వైసీపీ నేతలు టిడిపిలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇదే తరుణంలో ఆ కీలక నేత కూడా టిడిపిలోకి వెళ్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఎవరో ఆ వివరాలు ఏంటో చూద్దాం..

 పల్నాడు పర్యటనలో జగన్ పై విమర్శలు వస్తున్న సమయంలో జగన్ అది కూడా మంచిదేగా అంటూ స్వీకరిస్తున్నారు. ఇదే తరుణంలో జగన్ వైఖరిపై ఆ పార్టీ శ్రేణులు కాస్త నిరాశలో ఉన్నారు. ఇప్పటికే గడిచిన ఐదు సంవత్సరాలలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి,ఎన్నో కేసుల పాలై పోయి  ఉన్నటువంటి నేతలకు జగన్ కనీసం అండగా నిలబడడంలో విఫలమయ్యారట. ఈ తరుణంలో చాలామంది నేతలు వారి అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం టిడిపి బాట పడుతున్నారు. ముఖ్యంగా చీరాల వైసీపీ నాయకులంతా  జగన్ వెంట ఉండడానికి ఇష్టపడడం లేదు. 2019లో వైసీపీలో చేరినటువంటి కరణం బలరామకృష్ణమూర్తి, ఆయన కుమారుడు కరణం వెంకటేష్ ప్రస్తుతం పార్టీలో యాక్టివ్ గా లేకపోవడంపై ఆ నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది. కొన్ని రోజుల క్రితం జగన్ ప్రకాశం జిల్లా పర్యటనకు వెళ్లారు.

పొదిలి మార్కెట్ యార్డులో చాలామంది రైతులతో జగన్ మాట్లాడారు. ఈ క్రమంలో చాలామంది నాయకులు వచ్చినా కానీ కరణం కుటుంబ సభ్యులు ఒక్కరు కూడా హాజరు కాలేదు. దీన్ని బట్టి చూస్తే మాత్రం రాజకీయంగా కరణం కుటుంబమంతా మరో బాటలో వెళ్లాలని డిసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కరణం కుటుంబానికి టిడిపితో చాలా ఏళ్ల నుంచి మంచి అనుబంధం  ఉంది. ఆ బంధాన్ని మళ్లీ కొనసాగించాలని కరణం కుటుంబ సభ్యులు అనుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిజంగానే కరణం కుటుంబ సభ్యులు వైసిపిని వదిలి టిడిపి గూడుకు చేరుతారా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే జగన్ కి కోలుకోవాలని దెబ్బ తగిలినట్టే. ఎందుకంటే వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చాక టిడిపి పార్టీలో ఉన్న కరణం కుటుంబం కేసులకు భయపడి వైసీపీలో చేరింది.ఆ సమయంలో అదంతా మర్చిపోయిన జగన్ ఆయనకు కీలక పదవి ఇచ్చారు. కానీ ఇప్పుడు జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు కరణం ఫ్యామిలీ వైసిపి ని వదిలితే మాత్రం జగన్ కి నష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: