ఇతర దేశాలతో పోల్చి చూస్తే మన దేశంలో క్రికెట్ కు అభిమానులు ఎక్కువ అనే సంగతి తెలిసిందే. అయితే టెస్టులలో టీమ్ ఇండియా అత్యంత చెత్త రికార్డును నమోదు చేయడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. టీమ్ ఇండియా చివరిగా 9 టెస్టులు ఆడగా కేవలం ఒకే ఒక టెస్టులో విజయం సాధించడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. టెస్టులు ఆడిన జట్లలో మెజారిటీ జట్లు కనీసం రెండు మ్యాచులలో విజయం సాధించాయి.

అయితే  చెత్త ఫలితాలను సొంతం చేసుకున్న  దేశాల జాబితాలో భారత్, జింబాబ్వే ఉన్నాయి.  భారత్ సైతం ఘోర ఫలితాలతో  జింబాబ్వే సరసన చేరడంపై క్రికెట్ అభిమానులు ఫీలవుతున్నారు.   లీడ్స్ వేదికగా  జరిగిన తోలి టెస్ట్ లో  ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి పాలు కాగా  క్రికెట్ మాజీలు మాత్రం  కీలకమైన సమయాలలో టీమ్ ఇండియా విఫలమై  చేజేతులా ఓడిపోయిందని చెబుతుండటం గమనార్హం.

టీమ్ ఇండియా ఓటమికి కారణమేంటనే ప్రశ్నకు  క్యాచ్ లు ఫీల్డింగ్,  బుమ్రాకు సపోర్టింగ్ బౌలర్,  లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ కారణమని నెటిజన్లు  అభిప్రాయపడుతున్నారు.  టెస్టుల్లో భారత్ కు ఇలాంటి ఫలితాలు ఏంటని పలువురు క్రికెట్ అభిమానులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఐదు స్కోర్ చేసినప్పటికీ  టెస్టుల్లో  ఓడిన  తోలి జట్టుగా  భారత్ నిలిచిందని కామెంట్లు సైతం  వినిపిస్తున్నాయి.

గంభీర్ ఆధ్యర్యంలో భారత్ భారీ పరాజయాలను మూటగట్టుకున్న నేపథ్యంలో  టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్  గంభీర్ పై తీవ్ర విమర్శలు  వ్యక్తమవుతున్నాయి.  ద్రవిడ్ హయాంలో వరుస విజయాలతో టీమ్ ఇండియా దూసుకుపోయిందని చెప్పవచ్చు.  గంభీర్ ఇదే  ధోరణిని  కొనసాగిస్తే మాత్రం  క్రికెట్ చరిత్రలో అతిపెద్ద పరాజయాల పరంపర తప్పదని కామెంట్లు వినిపిస్తున్నాయి.  1967 - 68 సమయంలో   భారత్ వరుసగా ఏడు మ్యాచ్ లలో ఓడిపోయింది.  ప్రస్తుతం టీమిండియా 9 మ్యాచ్ లలో ఒకే ఒక మ్యాచ్ లో  విజయం సాధించి మరో అపవాదును మూటగట్టుకోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: