
అక్కడ నుంచి గ్రామస్తులు, రైతులు, మహిళలతో కలిసి నాలుగు కిలోమీటర్ల మేర పాదయాత్రతో జాతీయ రహదారిమీదకు చేరుకుని రాస్తారోకోతో పాటు ఆందోళన చేశారు. జాతీయ రహదారిని దిగ్భంధించడంతో పాటు రైతులకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చివరకు సబ్ కలెక్టర్ స్వయంగా రామచంద్ర యాదవ్‌తో ఈ భూసేకరణ ప్రక్రియ వెనక్కు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టును మరో ప్రాంతానికి తరలించేలా ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని హామీ ఇవ్వడంతో రామచంద్ర తన ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరేడు గ్రామంలో రైతుల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా నోటిఫికేషన్ ద్వారా పంటలు పండే భూములు ఇండోసోల్ కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
ఆదివారం తమ ఆందోళనను అడ్డుకునేందుకు ప్రభుత్వం యంత్రాంగం ఎన్ని ఇబ్బందులు పెట్టినా రైతులు, మహిళలు, బీసీవై నాయకులు ఎక్కడా తగ్గకుండా చేసిన ఆందోళన ఫలితంగానే ప్రభుత్వం తమ నిర్ణయం వెనక్కు తీసుకుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ తక్షణమే నెరవేర్చకపోతే భవిష్యత్తులో బీసీవై పార్టీ తరఫున ఉధ్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక్కడ ఆందోళనలో పాల్గొన్న రైతులు, మహిళలను భేషరతుగా విడుదల చేయాలని హామీ తీసుకున్నారు. రైతులకు మీ భూములు మీకు తిరిగి ఇచ్చేంతవరకు అండగా ఉంటానని... మీరందరు ధైర్యంతో ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు