
అయితే ఇప్పుడు తాజాగా రాజమండ్రి కి చెందిన ఆకుల కృష్ణ అనే కార్యకర్తకు చంద్రబాబు వీడియో కాల్ ద్వారా మాట్లాడారు .. మోరంపూడి జంక్షన్‌కు చెందిన ఆకుల కృష్ణ తెలుగుదేశం పార్టీ వీర అభిమాని .. టిడిపి కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొనేవారు . అలాగే ఆకుల కృష్ణ చంద్రబాబును ఒకసారి అయినా చూడాలని లేదా అయనలో మాట్లాడాలని ఎన్నోసార్లు కోరుకున్నాడు .. ఇక ఇప్పుడు ఈ విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు స్వయంగా అతనికి ఈ వీడియో కాల్ ద్వారా కృష్ణ తో మాట్లాడారు .. అలాగే కృష్ణ ఆరోగ్యం గురించి ఆరాతీసి అతనికి ధైర్యం కూడా ఇచ్చారు.
అదే విధంగా మంచి వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తా అని కూడా కార్యకర్తకు తాను ఉన్నానంటూ భరోసా ఇచ్చా ..ఇలా కార్యకర్తకు చంద్రబాబు ఫోన్ కాల్ వార్త వైరల్ గా మారింది .. అలాగే చంద్రబాబు తన కార్యకర్తల పట్ల చూపే ఆప్యాయతకు నిదర్శనంగా ఎన్నో ప్రశంసలు వస్తున్నాయి . అలాగే టిడిపిని కార్యకర్తల పార్టీ అంటారు .. టిడిపి నాయకత్వంపై కోపం వస్తే కార్యకర్తలు ఇంట్లో పడుకుంటారు కానీ వేరే పార్టీకి పనిచేయరు .. అంతటి కార్యకర్తల బలం టిడిపికి ఉందని చెబుతారు .. అలాంటిది కార్యకర్తల కష్టాలను తీర్చేందుకు టిడిపి నాయకత్వం ఎప్పటికప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది . అలాగే వారి సంక్షేమం కోసం ఎన్నో రకాల కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు .