ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం రేయింబవళ్లు కష్టపడుతున్న సంగతి తెలిసిందే. అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు తన వంతు కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ రాష్ట్రంలో సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఏపీ సీఎం ఇంటి ఎదుటి స్థలం కబ్జా కావడం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

కుప్పంలో చంద్రబాబు గారి ఇంటి ఎదుట ఉన్న  తన స్థలాన్ని వేరే వాళ్ళు కబ్జా  చేస్తున్నారంటూ  డ్యూటీ చేస్తున్న ఒక సైనికుడు పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.  నా పేరు ప్రసాద్ అని  మాది  ఓదనపల్లి అని  మీరు మా గ్రామంలో కొత్తగా నిర్మించిన ఇంటికి ఎదురుగా  నాకు ఒక  ఎకరం 20 సెంట్ల  భూమి ఉందని ఇందులో  15 సెంట్లను  రాజకీయ నాయకుడైన సుందరప్ప ఆక్రమించుకున్నాడని చెప్పుకొచ్చారు.

తన సమస్యపై  దృష్టి సారించిన  అధికారులు ఆ 15 సెంట్లకు ఫెన్సింగ్ వేశారని  ఆయన కామెంట్లు చేశారు.   శనివారం రోజున మా తండ్రి పొలం పనులు చేసేందుకు వెళ్లగా సుందరప్ప అతని కుటుంబ సభ్యులు  దాడి చేసినట్టు ఆయన చెప్పుకొచ్చారు.  టీడీపీలో కీలక నాయకులైన వీళ్ళు తమకు ఇబ్బందులు పెడుతున్నారని  ఆయన చెబుతున్నారు.

సీఎం సొంత నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి నెలకొనడం గురించి ప్రస్తుతం  సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.   ఈ వివాదం గురించి  టీడీపీ నేతలు ఏ విధంగా  స్పందిస్తారో చూడాల్సి ఉంది.  చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఈ తరహా వివాదాలు తలెత్తకుండా  తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని  అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: