రాజకీయాల్లో ఉన్న నేతలు ఏం చేసినా చెల్లుతుందని చాలామంది భావిస్తారనే సంగతి తెలిసిందే. ఉమ్మడి కడప జిల్లాకు చెందిన ఒక నేత వైసీపీలో ఉన్న సమయంలో కుంభకోణం చేసి ఇప్పుడు టీడీపీలో చేరి తనకు డబ్బులు ఇచ్చిన వ్యక్తికి చుక్కలు చూపిస్తున్నాడు. తన పరిస్థితి ఏంటని డబ్బులు ఇచ్చిన వ్యక్తి ప్రెస్ ముందు ఆవేదన వ్యక్తం చేస్తుండటం గమనార్హం. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నాడు నేడు కార్యక్రమం అమలైన సంగతి తెలిసిందే.

కడప జిల్లాకు చెందిన ఎంపీటీసీ సభ్యుడు సుదర్శన్ రెడ్డి  చేసిన అవినీతి విషయంలో ప్రభుత్వం విచారణ జరపాలని  విజయవాడకు చెందిన కంచి  రాజేష్  అనే కాంట్రాక్టర్ కోరడం గమనార్హం.  2020 సంవత్సరంలో నాడు నేడు పనుల కోసం గ్రీన్ చాప్ బోర్డు అనే మెటీరియల్ ను సరఫరా చేయడం కోసం  ఈ మేరకు సుదర్శన్ రెడ్డితో   తాను  ఎంఓయూ కుదుర్చుకున్నానని ఆయన చెబుతున్నారు.

దీని నిమిత్తం పలు దఫాలుగా కోటిన్నర రూపాయలు చెల్లించడం జరిగిందని  కానీ మెటీరియల్ మాత్రం సరఫరా కాలేదని ఆయన చెబుతున్నారు.  దీనికి బదులుగా నా డబ్బులు నాకు వెనక్కు ఇవ్వాలని కోరగా  డబ్బులు ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడటం జరుగుతోందని  కంచి రాజేష్  వాపోయారు.  రాష్ట్రంలో అధికారం మారిన నేపథ్యంలో  సుదర్శన్ రెడ్డి టీడీపీలో చేరడంతో తనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన చెబుతున్నారు.

 డబ్బుల గురించి అడిగితే  సుదర్శన్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నాడని  పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే సివిల్ ఫిర్యాదు అని  కేసు తీసుకోవడం లేదని   కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.  సుదర్శన్ రెడ్డి చేసిన మోసం విషయంలో టీడీపీ ముఖ్య నేతలు  ఏ విధంగా వ్యవహరిస్తారనే చర్చ జరుగుతోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు
 

మరింత సమాచారం తెలుసుకోండి: