భారత్ కు చెందిన ఒక మహిళ దోహా నుంచి ముంబైకి సైతం అక్రమంగా మాదకద్రవ్యాలను తరలిస్తూ చిక్కిన సంఘటన అధికారులను ఉలిక్కిపాటికి గురి చేసింది. అయితే అధికారులకు సమాచారం అందడంతో వెంటనే అప్రమత్తమయ్యి ఎయిర్ పోర్ట్ లో కట్టుదిట్టమైన తనిఖీలను నిర్వహించారు. ముఖ్యంగా బిస్కెట్లు, చాక్లెట్ల బాక్స్ లలో మధ్య ఈ కొకైన్ క్యాప్సిల్స్ ను తరలించడానికి సిద్ధపడిన మహిళను సైతం అధికారులు పట్టుకున్నారు. ఆ మహిళ నుంచి సుమారుగా 300 క్యాప్సల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.


అయితే వాటిని స్వాధీనం చేసుకున్న తర్వాత అధికారులు పరీక్షించగా అందులో ఉన్నవి కొకైన్ అని నిర్ధారించారు. దాని విలువ సుమారుగా రూ .62 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. పట్టుబడిన మహిళను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించి మరి విచారణ చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్వర్క్ పైన ఉక్కు పాదం మోపుతూ  తగిన చర్యలు తీసుకోవడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఆ మహి ఆ వెనక ఉన్న వారిని కూడా విచారించడానికి సిద్ధమవుతున్నారు అధికారులు. అక్రమంగా మాదకద్రవ్యాలు తరలిస్తున్న మహిళను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. మరి వీటి వెనక ఎవరెవరున్నారో మహిళ బయటపడుతుందేమో చూడాలి.


తరచూ ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాదకద్రవ్యాలు లేకపోతే గోల్డ్ స్మగ్లింగ్ వంటివి ఎక్కువగా  చేస్తూ విమానాశ్రయంలో దొరికేస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలామంది ఇలాంటి ఉచ్చులు చిక్కుకొని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు ఎంత నిగా పెంచినప్పటికీ కూడా ఎక్కడో ఒకచోట ఇన్ని కోట్ల రూపాయలకు సంబంధించి మాదకద్రవ్యాలు బయట పడుతూనే ఉన్నాయి. కానీ ఎక్కడో ఒకచోట మాత్రం మెగా వర్గాలకు చిక్కిపోతూ ఉన్నారు. ఇలాంటి మాదకద్రవ్యాలు వాడడం వల్ల కూడా చాలా ప్రమాదాలు ఉన్నాయని విషయాన్ని హెచ్చరిస్తూ ఉన్నా కూడా చాలామంది ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: