
ఈ చెల్లింపు www.cfms.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా నిర్దేశిత హెడ్ ఆఫ్ అకౌంట్, డీడీఓ కోడ్‌తో చేయాలని తెలిపారు. ప్రీమియం చెల్లించిన జర్నలిస్టులు ఒరిజినల్ చలానా, రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ జిరాక్స్ కాపీని విజయవాడలోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో లేదా జిల్లా కేంద్రాల్లోని సంబంధిత కార్యాలయాల్లో సమర్పించాలి. ఈ పథకం ప్రీమియం మొత్తం రూ. 2500 కాగా, ఇందులో జర్నలిస్టు వాటా రూ. 1250, ప్రభుత్వం రూ. 1250 భరిస్తుంది. ఈ స్కీమ్ జర్నలిస్టులు, వారి జీవిత భాగస్వామి, పిల్లలు, ఆధారపడిన తల్లిదండ్రులకు వర్తిస్తుందని శుక్ల వివరించారు.
ఈ హెల్త్ స్కీమ్ ద్వారా జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు అనారోగ్య సమయాల్లో ఒక్కోసారి రూ. 2 లక్షల వరకు వైద్య సేవలు పొందవచ్చు. సంవత్సరంలో ఎన్నిసార్లైనా ఈ సదుపాయం పరిమితులు లేకుండా అందుతుంది. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ తరహాలో నగదు రహిత వైద్య సేవలు, ఉచిత అవుట్‌పేషెంట్ సేవలు కూడా లభిస్తాయి. ఆదాయ పరిమితులు లేకుండా ఈ సేవలు అందించడం విశేషం. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ఈ పథకాన్ని అమలు చేస్తుంది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు