తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్రను పోషించిన వారిలో బండి సంజయ్ , ఈటల రాజేందర్ కూడా ఉంటారు. ఇక బండి సంజయ్ తన రాజకీయ కెరియర్ని దాదాపుగా బి జె పి పార్టీలో ప్రారంభించి బి జె పి పార్టీలోనే కొనసాగుతున్నాడు. ఇకపోతే బి జె పి పార్టీలో ఈయనకు అత్యున్నత స్థానం పార్టీ అధిష్టానం కల్పించింది. అలాగే కొంత కాలం క్రితం తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిలో కూడా బండి సంజయ్ కొనసాగారు. ఇకపోతే ఈటెల రాజేందర్ , కెసిఆర్ తో కలిసి చాలా కాలం ప్రయాణించాడు. అలాగే బీ ఆర్ ఎస్ పార్టీలో అత్యున్నత బాధ్యతలను కూడా నిర్వహించాడు.

కానీ ఆ తర్వాత కేసీఆర్ , ఈటెల కి మధ్య విభేదాలు రావడంతో ఆయన బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసి బి జె పి పార్టీలోకి వచ్చారు. బీ జే పీ పార్టీలోకి ఈటెల వచ్చే సమయానికే బండి సంజయ్ బి జె పి పార్టీలో మంచి హోదాలో ఉన్నాడు బి జె పి పార్టీలోకి ఈటెల వచ్చాక బండి సంజయ్ తెలంగాణ అధ్యక్ష పదవి కోల్పోయింది. దానితో కొంత మంది బండి సంజయ్ అధ్యక్ష పదవి కోల్పోవడానికి ఈటెల కారణం అని , ఆయన కారణం గానే ఆయన అధ్యక్ష పదవి పోయింది అని కూడా కొంత మంది అభిప్రాయాలను వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.

ఇకపోతే వీరిద్దరి మధ్య గొడవ చిలికి చిలికి గాలి వానగా మారేలా కనబడుతోంది. తాజాగా వీరిద్దరి మధ్య గొడవ మరింత పెరిగినట్లు చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఒకానొక సభలో భాగంగా బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేయగా అది ఈటెలను ఉద్దేశించి చేసినట్లుగా ఈటెల అభిమానులు భావించడం , దానితో ఈటెల కూడా ఘాటుగానే రియాక్ట్ అయినట్లు తెలుస్తుంది. వీరిద్దరి మధ్య గొడవ మరింత మధురై అవకాశాలు ఉన్నాయి అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: