- ( గ్రేట‌ర్ హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) . . .

తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న రామచంద్రరావుకు మొదటి సవాల్ సొంత పార్టీ నుంచే ఎదురవుతుంది. ఈటెల రాజేందర్ - బండి సంజయ్ మధ్య ఏర్పడిన గ్యాప్ కూడా పూడ్చాల్సిన‌ అవసరం కనిపిస్తోంది. వీరిద్దరి మధ్య హుజూరాబాద్ పెద్ద సమస్యగా మారుతుంది. ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు .. కానీ తాను సుదీర్ఘంగా ప్రాథినిత్యం వహించిన హుజురాబాద్ స్థానం వదులుకోవాలని అనుకోవడం లేదు. కానీ కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ హుజరాబాద్ లో బిజెపి కార్యకర్తలను బలోపేతం చేస్తూ తన వర్గం ను బ‌ల‌ప‌రుచు కుంటున్నారు. ఈటెల రాజేందర్ వర్గం ప్రాధాన్యతను తగ్గిస్తున్నారు. స్థానిక ఎన్నికలలో ఆ వర్గానికి టికెట్లు దక్కకుండా పూర్తిగా తన వారికే ఛాన్స్ ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


దీంతో ఈటిల మధ్య మీద గుగ్గిలం అవుతున్నారు. ప్రతి పంచాయతీలు తన మనుషుల సర్పంచ్లుగా ఉంటారని ఆయన చెబుతున్నారు. అది అంత తేలిక కాదని ఈటెలకు తెలుసు. పైగా ఇద్దరు బీసీ వర్గాలకు చెందిన నేతలు. ఒకరు బిజెపిలో మొదటి నుంచి ఉన్నారు. రామచంద్రరావుకు అధ్యక్ష పదవి రావడం వెనక బండి సంజయ్ సపోర్టు ఉందన్న ప్రచారం జరుగుతుంది. ఈ కారణంగా ఈటెల కంటే రామచంద్రరావు బండి సంజయ్ కే సపోర్టుగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈటలను బలహీనం చేయాలని చూడ‌డం రామచంద్రరావు వల్ల కాదు. అందుకే వీరి మధ్య సమస్యను హై క‌మండ్ సాయంతోనే రామచంద్రరావు పరిష్కరించాల్సిన పరిస్థితి నెలకొంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: