
రాజకీయ కుట్రలను భగ్నం చేసి, కరేడు రైతుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకే ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించానన్నారు. రాజకీయ నాయకులు, అధికారులు ఎన్ని కుట్రలు చేసినా కరేడు భూములను తీసుకోలేరన్నారు. ముందు నాలుగు వేల ఎకరాలే సేకరిస్తామని కలెక్టర్ ప్రకటించారని దాని వెనుక కుట్ర దాగి ఉందన్నారు. రైతులను విడగొట్టి, ఐకమత్యాన్ని చెడగొట్టి భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రైతుల భూముల జోలికి వస్తే మరో నందిగ్రామ్ ఉద్యమం అవుతుందని హెచ్చరించారు. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. త్వరలోనే కరేడులో పర్యటిస్తానన్నారు. ప్రాణం ఉన్నంత వరకు కరేడు రైతుల కోసం పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు మాట్లాడిన కరేడు రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఉద్యమానికి రామచంద్రయాదవ్ మద్దతు ప్రకటించాకే అన్ని పార్టీలు తమ వద్దకు వచ్చాయన్నారు. రామచంద్రయాదవ్ లేకపోతే కరేడు రైతులకు న్యాయం జరగదని గ్రహించామన్నారు. ఊర్లో మహిళలు రామచంద్రయాదవ్ ను కరేడుకు తీసుకువస్తేనే గ్రామంలో అడుగుపెట్టమని చెప్పి పంపారని రైతులు భావోద్వేగానికి గురయ్యారు.