అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం.. ప్రపంచ రాజకీయాలను ఓ మోస్తరు షేక్ చేసింది. భారత్‌ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్‌ను 25% నుంచి ఏకంగా 50% కి పెంచేశాడు. ముఖ్యంగా వ్యవసాయ, మత్స్య, పాడిపరిశ్రమలపై ఈ ప్రభావం బలంగా పడనుంది. అయితే దీని నేపథ్యాన్ని రాజకీయం చేయకుండా, దిమ్మ తిరిగే మాస్ స్టైల్లో గట్టి సమాధానం ఇచ్చారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. రైతే దేవుడు! మోదీ డైరెక్ట్ ఎటాక్‌! .. ఎం.ఎస్. స్వామినాథన్ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మోదీ స్పష్టంగా చెప్పేశారు –


 "రైతుల ప్రయోజనాలకు తల వంచే ప్రసక్తే లేదు. ఏ నిపుణుల ఒత్తిడైనా, ఎలాంటి విదేశీ డిమాండ్ అయినా రావచ్చు.. కానీ రైతుల కోసం నేనేమైనా తలపడతా!" ..  ఇది కేవలం వేదిక మీద మాటే కాదు.. ట్రంప్ టారిఫ్ నిర్ణయానికి స్ట్రాంగ్ కౌంటర్. భారత పంటలు, రొయ్యలు, తోలుబట్టలు.. ఇవన్నీ ఇప్పుడు అమెరికాలోకి వెళ్లే దారులు ఖర్చుతో నిండిపోతాయి. కానీ దేశీయ రైతులకు గీత దాటే ఒప్పందాలు ఉండవంటూ మోదీ బలమైన సంకేతం పంపించారు. అమెరికా ఎందుకు ఇలా చేసిందంటే ... భారత్ నుండి దిగుమతి అయ్యే వస్త్ర ఉత్పత్తులు, రొయ్యలు, పాడిపరిశ్రమ ఉత్పత్తులు వంటివే ఈ టార్గెట్. ట్రంప్ అడిగింది ఒక్కటే – "మీరు మాకు దిగుమతి సుంకాలు తగ్గించండి, మేము మీ ఉత్పత్తులను పెద్ద ఎత్తున కొంటాం." కానీ భారత్ స్పష్టంగా నో చెప్పింది. రైతులు నష్టపోతారు అని వాదించింది.


 దీంతో ట్రంప్ తట్టుకోలేక, నేరుగా టారిఫ్ పెంచేశాడు. చమురు గొడవ.. ట్రంప్ అసలైన కోపం ఇదేనా? ..  భారత్ ఇటీవల రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేసింది. ఇది అమెరికాకు అసహనానికి దారితీసింది. తమ ప్రభావాన్ని కోల్పోతున్నామని భావించిన ట్రంప్ .. వాణిజ్యపరంగా దెబ్బ తీసే దిశగా ఈ టారిఫ్ నిర్ణయం తీసుకున్నాడని విశ్లేషకులు చెబుతున్నారు. 🇮🇳 మోదీ స్టాండ్.. అంతర్జాతీయ స్థాయిలో గట్టి సంకేతం! మోదీ వ్యాఖ్యలు ఇప్పుడే కాదు.. గతంలోనూ అంతర్జాతీయ ఒత్తిళ్లపై దిగజారని మోదీ, ఇప్పుడు కూడా రైతుల విషయంలో ఆత్మగౌరవంతో నిలబడ్డారు. "భారత్ భయపడదు.. మానిపులేట్ అవదు!" అనే క్లారిటీ ఇచ్చేశారు. ఇది కేవలం రైతులకు న్యాయం చేసే ప్రయత్నం కాదు .. దేశ వైఖరికి ప్రతిష్టను తీసుకొచ్చే జాతీయ అభిమానం.



మరింత సమాచారం తెలుసుకోండి: