రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో అప్పటినుండి కేసీఆర్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాడు. అసలు కేసీఆర్ మనసులో ఈ పిల్ల బచ్చా నన్ను ఓడించి సీఎం అవ్వడం ఏంటో అని అనుకుంటున్నట్టు ఆయన ప్రవర్తన చూస్తే అర్థమవుతుంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తనకి అధికారాన్ని పూర్తిగా వినియోగించుకునే అవకాశం ఉన్నా కూడా వారిని చూసి చూడనట్టు వదిలేస్తున్నాడు. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఎన్నో అవినీతి అక్రమాలు బయటికి వచ్చాయి.ఈ అవినీతి అక్రమాలలో ఇప్పటికే తండ్రి కొడుకులిద్దర్నీ జైల్లో వేయవచ్చు. కానీ రేవంత్ రెడ్డి అలా చేయడం లేదు. తన మార్క్ ప్రతీకరం తాను తీర్చుకుంటూ పోతున్నాడు.ఆయన వారిని జైల్లో పెట్టి వారిని హీరోలను చేసి ఆయన జీరో అవ్వాలని అస్సలు చూడడం లేదు. చాలాసార్లు తండ్రీ కొడుకులను అరెస్టు చేసే అవకాశం వచ్చినా కూడా రేవంత్ రెడ్డి చూసి చూడనట్టు వదిలేస్తున్నాడు.. 

ఒకరకంగా రేవంత్ రెడ్డి ఇలా చేయడం కూడా ఆయన కి ప్లస్ అవ్వచ్చు. ఎందుకంటే కేసీఆర్ ని అరెస్టు చేసి జైల్లో వేస్తే రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఏర్పడుతుంది. కేసీఆర్ హీరో అవుతాడు రేవంత్ రెడ్డి జీరో అవుతాడు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న రేవంత్ రెడ్డి చచ్చిన పాముని మరింత చంపడం ఎందుకు అన్నట్లుగా కెసిఆర్ ఫ్యామిలీ ని చూసి జాలిగా క్షమించి వదిలేస్తున్నాడు.అయితే చాలామంది ఒకరు అధికారంలో ఉన్నప్పుడు వ్యతిరేకతను ఎదుర్కొంటే మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఎలా ప్రవర్తించారో వీళ్ళు కూడా అలాగే ప్రవర్తించాలి అనుకుంటారు. కానీ ఇలాంటి ప్రతీకార రాజకీయాలకు రేవంత్ రెడ్డి వ్యతిరేకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కెసిఆర్ హయాంలో రేవంత్ రెడ్డిని అరెస్టు చేసి జైల్లో వేశారు. కానీ రేవంత్ అదంతా పట్టించుకోకుండా కెసిఆర్ ని వదిలేస్తున్నాడు.

అంతేకాదు ఆయన అధికారంలోకి రాకముందు మీ కల్వకుంట్ల ఫ్యామిలీకి మొత్తం చర్లపల్లి జైల్లో ఇల్లు కట్టిస్తా అన్నట్లుగా మాట్లాడారు.కానీ అధికారంలోకి వచ్చాక వాళ్లకు జైలుకు వెళ్లే అవకాశం వచ్చినా కూడా రేవంత్ ఇరికించడం లేదు.అలాగే శత్రువుని జాలితో చూసి చూడనట్లు వదిలేస్తున్నాడు అంటే ఇది నిజంగా కేసీఆర్ కి జీర్ణించుకోలేని విషయమనే చెప్పుకోవచ్చు.ఎందుకంటే శత్రువు ప్రతీకరం తీర్చుకుంటే వేరేలా ఉంటుంది. కానీ జాలిపడి వదిలేస్తే అది మరింత తీవ్రంగా కలిచివేస్తుంది.ప్రస్తుతం రేవంత్ రెడ్డి కెసిఆర్ కేటీఆర్ ని అలా జాలిగానే వదిలేస్తున్నాడు. దీంతో ఈ విషయాన్ని చాలామంది రాజకీయ విశ్లేషకులు హైలెట్ చేస్తూ రేవంత్ రెడ్డి మార్కు ప్రతీకారం అంటూ చెప్పుకొస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: