గత కొంతకాలంగా ఎన్నికల కమిషన్, కేంద్ర సర్కార్ పైన చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో దొంగ ఓట్లు వేయిస్తున్నారనే విధంగా చాలా రాష్ట్రాలలోని నేతలు కూడా ఇప్పటికే మాట్లాడారు. ఇటీవలే రాహుల్ గాంధీ కూడా అందుకు సంబంధించిన అన్ని వివరాలు వివరించడంతో ఈ విషయం మరింత చర్చనీయంశంగా మారింది. ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం పైన ఎన్నికల కమిషన్ పైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఇటీవలే కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ ఫైర్ అయ్యారు.


ప్రధాన నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరూ కూడా దొంగ ఓట్లు వేయిస్తున్నారనే ఆరోపణలు చేస్తున్నారు. ఒక బెంగళూరులోనే బిజెపి పార్టీకి చెందిన ఒక నేత తమ అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష దొంగ ఓట్లు వేయించుకున్నారు అంటూ ఆరోపణలు చేశారు. అటు ఎన్నికల కమిషన్ ఇటు బిజెపి పైన సిపిఐ నేత చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. దేశంలో ఎక్కువగా దొంగల పాలన సాగుతోందని.. రేపు బీహార్ లో జరిగే ఎన్నికల కోసం 60 లక్షల ఓట్లు తీసేసారని కేవలం బిజెపి పార్టీకి అనుకూలంగా ఉన్న ఓట్లను మాత్రమే ఉంచి మిగతా వాటిని తొలగించారు అంటూ ఫైర్ అయ్యారు.


ఎన్నికల కమిషన్ బిజెపి పార్టీకి అమ్ముడుపోయిందని ఆరోపణలు చేశారు. ఈ సమస్య  కాంగ్రెస్ పార్టీది,రాహుల్ గాంధీ ఒక్కరిదే కాదు మోడీ ప్రభుత్వం పైన అందరూ పోరాటం చేయాలి అంటు పిలుపునిచ్చారు.. రైతుల బాధలు, కష్టాలను బిజెపి పార్టీ ఎప్పుడైనా ఆలోచించిందా? మీరు దేశంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పాలి అంటూ నిలదీశారు.. తప్పుడు కేసులు పెట్టి అందరిని జైల్లో పెట్టడం వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ రాజకీయం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. అలాగే సీనియర్ నేతగా పేరుపొందిన చంద్రబాబు దొంగ ఓట్ల పైన ఎందుకు ప్రశ్నించడం లేదు మాట్లాడడం లేదు అంటూ ఫైర్ అయ్యారు.. తిరుపతి లడ్డు కల్తీ పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు కేవలం ఆరోపణలు మాత్రమే చేశారు..డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ ప్రతి మంగళవారం నాలుగు నుంచి ఐదువేల కోట్లు అప్పు చేస్తూ ముందుకు వెళ్తున్నారంటూ ఫైర్ అయ్యారు సిపిఐ రామకృష్ణ.

మరింత సమాచారం తెలుసుకోండి: