గడచిన కొద్ది రోజుల క్రితం ఐసిఐసిఐ బ్యాంక్ తమ కస్టమర్లకు ఒక భారీ షాక్ ఇచ్చింది.. అదేమిటంటే సేవింగ్స్ ఖాతాలో మినిమం బాలన్స్ రూ .50వేల రూపాయలు మెయింటైన్ చేయాలని లేకపోతే చార్జీలు వసూలు చేయాల్సిన పరిస్థితి ఉంటుందంటూ వెల్లడించింది. దీంతో ఒక్కసారిగా అటు కస్టమర్ల నుంచి కూడా చాలా వ్యతిరేకం రావడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఐసిఐసిఐ బ్యాంక్ పొదుపు ఖాతాలకు కనీసం బ్యాలెన్స్ పరిమితులను మార్చినట్లుగా తెలుస్తోంది.


కొత్త మినిమం అకౌంట్ బ్యాలెన్స్.. మెట్రో ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో కనీసం రూ .15000 రూపాయలు ఉండాలట.. సెమి అర్బన్ కస్టమర్లు రూ.7500 రూపాయలు, గ్రామీణ ప్రాంతాలలోని వారు 2,500 రూపాయలు ఉంచేలా ఖరారు చేశారు. గతంలో పట్టణాలలో రూ .50,000, సెమీ అర్బన్ ప్రాంతాలలో 25000.. గ్రామీణ ప్రాంతాలలో 10 ,000  రూపాయలు ఉండాలని నిర్ణయించడంతో మధ్యతరగతి ఖాతాదారులకు ఇది చాలా భారంగా ఉంటుందని విమర్శలు ఎక్కువగా వెళ్ళబడ్డాయి. ముఖ్యంగా ధనవంతులైన క్లైంట్ల పైనే దృష్టి సాధిస్తోందంటూ ఐసిఐసి బ్యాంకు పైన చాలా విమర్శలు కూడా వినిపించాయి.


RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా కూడా బ్యాంకులకు మినిమం బాలన్స్ నిబంధనలు పెంచుకునే స్వేచ్ఛ ఆ బ్యాంకులకు ఉంటుందంటూ తెలియజేశారు.. దీంతో భారీగా పెంచేసిన ఐసిఐసిఐ బ్యాంక్ మినిమమ్ బ్యాలెన్స్   పై ప్రజా వ్యతిరేక రావడంతో పాటుగా బ్యాంకు ఖాతాదారులు ఇతర బ్యాంకులకు కూడా వెళ్లిపోయే అవకాశం ఉందని.. అలాగే కొత్త వారు కూడా ఖాతాలను ఓపెన్ చేసేవారు తగ్గిపోతారని కారణంతోనే ICIC బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో 50,000 మినిమం బాలన్స్ అవసరాన్ని ఉపసంహరించుకున్నది. ఎక్కువగా కరెంట్ అకౌంట్ బ్యాంక్ అకౌంటు కలిగిన వారు  మాత్రమే వీటిని ఉపయోగించగలరని..కానీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ మాత్రం సాధారణ, దిగువ మధ్య తరగతి వారు మాత్రమే ఉపయోగిస్తారు. ఇందులో చాలామందికి శాలరీ అకౌంట్స్ కూడా ఉండడంతో ఖాతాదారులు అందరూ కూడా ఆందోళన చెందుతూ ఉండడంతో వాటన్నిటిని ఉపసంహరించుకుంది ICICI.

మరింత సమాచారం తెలుసుకోండి: