వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక మోస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. పొలిటికల్ పరంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట, ఎవరి సూచనలు వినేటైపు కాదని చాలామంది నేతలు తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి.. జగన్ ఏమనుకుంటే అదే చేసుకుని వెళ్లే రకం కాబట్టి వాటిని ఇష్టపడే చాలామంది నేతలు వైసిపి పార్టీలో చేరామని తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ 2024లో ఓడిపోయిన తర్వాత జగన్ రియలైజ్ అవ్వలేదు. ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా అంగీకరించలేదు..


అయితే ఇప్పుడు అటువంటి వైసీపీ పార్టీలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది." పోయిన చోటే వెతుక్కోవడం". జగన్ ఓడిపోయిన 15 నెలల తర్వాత గత వారం రోజుల క్రితం జరిగిన ఇంటర్నల్ మీటింగ్లో చర్చించిన విషయం ఏమిటంటే.. మొదటి నుంచి వైసిపి పార్టీకి కీలకంగా ఉన్న ప్రాంతాలు ఏంటి? కీలకంగా ఉన్న వర్గాలు ఏంటి? కిలకంగా ఉన్న సామాజిక వర్గం ఏమిటి? అని మూడు అంశాల పైన చర్చించారు.2024 లో వాళ్లు కూడా ఓటు ఎందుకు వేయలేదనే విషయంపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది.



ఉదాహరణకు రెడ్డి సామాజిక వర్గం 2014లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం వైసీపీ పార్టీకి 67% ఓటు వేశారు. 2019 జరిగిన ఎన్నికలలో రెడ్డి సామాజిక వర్గం వైసీపీ పార్టీకి 74% ఓటు వేశారని అంచన. 2024 వచ్చేసరికి వైసీపీ పార్టీకి 60% వరకు ఓట్లు వేశారు.. అంటే సుమారుగా 17% వరకు తగ్గిపోయింది.  ఇంత తగ్గిపోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయంపై చర్చించుకున్నారు.రెడ్డి సామాజిక వర్గంలో విపరీతంగా డామినేషన్ ఉన్న నియోజకవర్గాలు ఏపీ రాష్ట్రంలో 42వ సీట్ లో ఉన్నాయి.. ఉమ్మడి కడప జిల్లాలో 7 సీట్లు, ఉమ్మడి కర్నూలులో 10 సీట్లు, ఉమ్మడి చిత్తూరులో 9 సీట్లు, ఉమ్మడి అనంతపురంలో 8 సీట్లు, ఉమ్మడి నెల్లూరులో 8 సీట్లు, ఉమ్మడి ప్రకాశంలో 7 సీట్లు, ఉమ్మడి గుంటూరులో 7 సీట్లు వీటన్నిటిలో కూడా రెడ్డి సామాజిక వర్గ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 42 సీట్లకు పైగా పూర్తిగా రెడ్డి సామాజిక వర్గం కంట్రోల్లోని ఉంటాయి. అయితే అటువంటి సీట్లలో కూడా 35 సీట్లకు పైగా వైసిపి ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయాం అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.



అసలు సొంత వర్గం వాళ్ళు , సొంత ప్రాంతం వాళ్ళు, సొంత జిల్లా వాళ్లే ఎందుకు ఓటు వేయలేదనే విషయం.. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పిటిసి స్థానాలు ఓడిపోయిన తర్వాత , కొంతమంది వ్యూహకర్తలతో, సీనియర్ నేతలతో మాట్లాడిన తర్వాత రియలైజ్ అయ్యారు జగన్. ఇక వైసిపి పార్టీకి రెడ్డి సామాజిక వర్గమే కాకుండా ఎస్సీలు, ముస్లిమ్స్, బీసీలలో కొన్ని వర్గాలు పట్టు ఉంది. అలాంటి ఓట్లలో ఎస్సీల నుంచి వైసీపీకి 75% పైగా పడతాయి అనుకుంటే.. మొన్న ఎన్నికలలో 62 శాతమే పడ్డాయి. బీసీలలో కూడా 2024 ఎన్నికలలో వైసిపి పార్టీ అనుకున్న స్థాయిలో ఓట్లు వేయలేదు. దీంతో మీటింగ్లో మాట్లాడి మళ్లీ తిరిగి మన ఓట్లు మనం సంపాదించుకునేందుకు తగ్గ చర్యలు తీసుకోవాలని తెలిపారు.

దీంతో వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్ లెవెల్లో ఒక ఆపరేషన్ మొదలుపెట్టారని వినిపిస్తున్నాయి.. ఏ బూతు ఏ సామాజిక వర్గం కంట్రోల్ లో ఉంటుంది.. ఆ సామాజిక వర్గం వారు వైసిపి పార్టీకి ఎందుకు ఓటు వేయలేదు.. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా ఇబ్బందులా, ఎవరి ఊహకు అందని సీట్లతో ఎందుకు ఓడిపోవలసి వచ్చింది అన్న చర్చలు మొదలయ్యాయి. వైసిపి పార్టీ సర్వే టీమ్ ఓడిపోకూడని సీట్లలో ఎందుకు ఓడిపోయామనే విషయంపై సర్వే చేస్తున్నారు. ఈ సర్వే ఎందుకు ఓటు వేయలేదనే వాటితోపాటు వేయాలంటే ఏం చేయాలి ?.. ఈ 15 నెలల కూటమి పాలన పై వారికి ఉన్న అభిప్రాయం ఏంటి.. వారికున్న వ్యతిరేకతలను తమ వైపు తిప్పుకోవాలని ఆలోచనతో  కూడా సర్వే చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: