అమెరికా భారతదేశం రెండు మిత్ర దేశాలని చెప్పుకుంటూనే ఇండియాపై టారీఫ్ ల ద్వారా భారం మోపుతున్నారు. ఇప్పటికే 25శాతం సుంకాలు  పెంచిన అమెరికాకు తాజాగా అక్కడి సుప్రీంకోర్టుతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇంత మొత్తంలో టారీఫ్ ఎందుకు పెంచుతున్నారని అక్కడి సుప్రీంకోర్టు అడిగితే  ఉక్రెయిన్ లో శాంతి స్థాపన కోసమే పెంచామని సుప్రీంకోర్టుకు అమెరికా  ప్రెసిడెంట్ బృందం వివరణ ఇచ్చింది. ఈ టారిఫ్ లను తగ్గిస్తే దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తుందని చెప్పుకొచ్చింది. ఈ సుంకాలు విధించడం వల్లే దేశం కాస్త ఆర్థిక వృద్ధిలోకి వెళ్తోందని ఆ బృందం అంటుంది. 1977 ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ  ఎకనామిక్స్ పవర్స్ యాక్ట్ నిబంధనల ప్రకారం ఎక్కువ మొత్తంలో సుంకాలు  విధించరాదని  సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

 ఇదే సమయంలో ట్రంప్ సర్కార్ తరపున సొలిసిటర్ జనరల్  జాన్ సౌరు వాదించారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగానే ఈ టారీఫ్ పెంచామని, ఆ యుద్ధాన్ని ఆపి శాంతి నెలకొల్పేందుకే  ట్రంప్ ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. దీనివల్లే ఇండియాపై అత్యధికంగా టారీఫ్ లు వేసామని, రష్యా నుంచి ఇండియా విపరీతంగా ఆయిల్ కొంటుందని, దీనివల్ల వచ్చిన డబ్బులతో రష్యా  ఉక్రెయిన్ పై దాడులకు తెగబడుతుందని తెలియజేశారు.  ఇండియాకు కూడా వారి దగ్గర ఆయిల్ కొనవద్దని చెప్పినా ఇండియా వినడం లేదని అన్నారు.  దీనివల్లే వాణిజ్య లోటు ఏర్పడిందని  దాన్ని భర్తీ చేయడం కోసమే 25% సుంకాలు  విధించామని సుప్రీంకోర్టుకు జాన్ సౌరు వివరించారు.

 గతంలో అమెరికాను కూడా అనేక దేశాలు సుంకాల పేరుతో దోచుకున్నాయని తెలియజేశారు. సుంకాల విధింపు విషయంలో ఏ మాత్రం అమెరికా వెనక్కి తగ్గినా ఆర్థికంగా వెనుకబడిపోతుందని సుప్రీంకోర్టుకు తెలియజేశారు. దీన్నిబట్టి చూస్తే అమెరికా ఇండియాకు వణికి పోతుందని, డైరెక్ట్ గా ఎదుర్కోలేక సుంకాల పేరుతో వారి దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుందని అర్థమవుతుంది. మనపై టారీఫ్ విధిస్తే రష్యా ఉక్రెయిన్  యుద్ధం ఆగిపోతుందని చెప్పడం దారుణం. ఏది ఏమైనప్పటికీ మోడీ ప్రభుత్వానికి అమెరికా కూడా కాస్త భయాందోళనకు గురవుతుందని ఈ విషయాన్ని చూస్తే అర్ధమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: