ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని చాలా దేశాలు ఉపయోగించుకుంటూ.. ఒకదానిని మించి మరొకటి అప్డేట్ అవుతూ ముందుకు వెళ్తున్నాయి. అయితే మరికొన్ని దేశాలలో అభివృద్ధి లేక ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు చూస్తుంటే డెవలప్మెంట్లో ఆ దేశాలు ఇంకా ఇంత వెనుకబడిపోయాయానే అనుమానాలు కూడా కలగక మానదు. అసలు విషయంలోకి వెళ్తే ఈ మధ్యకాలంలో పెద్దవాళ్లను మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా డబ్బు కావాలి అంటే బ్యాంకులకు వెళ్లకుండా ట్రాన్సాక్షన్ కోసం యూపీఐ, ఫోన్ పే,గూగుల్ వంటి వాటిని ఉపయోగిస్తున్నాము. వీటి వాడకం ఏ రేంజ్ లో ఉందంటే టీ కావాలన్నా సరే యూపీఐ ఉపయోగించే స్థాయికి చాలామంది చేరుకున్నారు. దీన్ని బట్టి చూస్తే టెక్నాలజీని ఏ రేంజ్ లో ఉపయోగించుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.


అయితే ఇలాంటి ట్రాన్సాక్షన్ యాప్ లను.. ఇంకా  ఇప్పుడు  మరికొన్ని దేశాలు ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా సౌదీ అరేబియాలో కూడా గూగుల్ పే వంటివి తాజాగా మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. వాటి గురించి చూద్దాం. అరబ్ దేశాలలో ఉండేటువంటి ప్రజలు తమ పిల్లలను ఇతర దేశాలలో  చదివించడం వల్ల అక్కడ వారికి స్వేచ్ఛ లభించడంతో.. అక్కడ వారు కొత్తదనాన్ని చూశారు. ఆ తర్వాత తమ దేశాలకు వచ్చిన తరువాత ఆధునీకరణను ప్రారంభించారు. వాటి పర్యావసానమే సౌదీ అరేబియా, దుబాయ్ ఆధునిక టెక్నాలజీకి అనుకూలంగానే డెవలప్మెంట్ అవుతున్నాయి.

అంతేకాకుండా అంతర్జాతీయ పోటీని తట్టుకొనే విధంగా వ్యవహరిస్తున్నారు. ఎంత వేగంగా అందుకుంటున్నారంటే.. ఇప్పుడు పేమెంట్ స్ట్రక్చర్ గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ ట్రాన్సాక్షన్స్ యాప్ లను సౌదీ అరేబియా సెంట్రల్ బ్యాంకు తాజాగా లాంచ్ చేసింది. మొదట గూగుల్ పే అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత..దాని స్థానంలో" ఆలీ పే ప్లస్"  అన్నటువంటి సరికొత్త యూపీఐ ట్రాన్సాక్షన్ యాప్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నారట. వీటిని 2026 నాటికి తీసుకు వస్తామంటూ ప్రకటించారు. మొదట గూగుల్ పే తర్వాత ఆలీపే వంటి యాప్ లను తీసుకొస్తామంటూ  ప్రకటించింది సౌదీ. ఇండియాలో పదేళ్ల క్రితమే మొదలైన.. కాని 2016 నోట్ల రద్దు తర్వాత ఎక్కువగా వీటిని ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు సౌదీ అరేబియా వీటిని మొదలు పెట్టబోతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: