
అంతేకాకుండా నీ స్థలంలోకి నా మనసులు వస్తారు! నువ్వు అక్కడ లేకపోయినా నీ ఇంటికి వస్తారు అక్కడ సెటిల్ చేసుకో..లేకపోతే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి ఎత్తుకొచ్చేస్తారంటూ హెచ్చరించారు. ఇవే కాకుండా మరికొన్ని బూతు పదాలతో చెప్పుకోలేని పదాజాలం వాడారంటూ టిడిపి నేత సూర్య ప్రకాశ్ రెడ్డి ఆరోపణలు చేశారు. వీటన్నిటికీ కౌంటర్ వేస్తూ గడ్డం బాబా లాగా తాడిపత్రిలో పిచ్చిపిచ్చి చేష్టలు తాను చేయనని..
డేరా బాబా మాదిరిగా నువ్వు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నావని టిడిపి నేత సూర్య ప్రకాశ్ రెడ్డి మాట్లాడారు. అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో చేసినట్లుగా ఇక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తే ఒంగోలులో చెల్లవని హెచ్చరించారు. నువ్వు ఒక టిడిపి నాయకుడికి ,తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పదవిలో ఉన్నావు అక్కడ ఉన్న మురుగు సంగతి చూసుకో.. అక్కడ మరుగు కంపు కొడుతోంది, దానిని కడుక్కోలేని నువ్వు ఒంగోలుకి వచ్చి ఏం పీకుతావ్ అంటూ టిడిపి నేత సూర్య ప్రకాశ్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన న్యూస్ అయితే ఇప్పుడు వైరల్ గా మారింది. మరి ఈ వ్యాఖ్యలపై ప్రభాకర్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి మరి.