ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు 74 సార్లు పర్యటనలే చేసినట్లుగా వినిపిస్తున్నాయి. గడచిన శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ కు వచ్చిన చంద్రబాబు ఆదివారం రాత్రి వరకు మూడు కార్యక్రమాలకు హాజరయ్యారు. అనంతరం తిరిగి మళ్లీ ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరారు. సీఎంగా గెలిచినప్పటి నుంచి చంద్రబాబు తీరు ఇలాగే ఉన్నదని ప్రజలకు మాట్లాడుకుంటున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు రాకపోకలు కొనసాగించడమే కాకుండా, వారంలో విశ్రాంతి, వినోదల, విందుకోసం ప్రత్యేకించి మరి విమానాలలో తిరుగుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలు ట్రోల్ చేస్తున్నారు.
ఇటీవలే అధికారిక పర్యటనలో భాగంగా గన్నవరం నుంచి దుబాయ్ కి వెళ్ళిన సీఎం చంద్రబాబు అక్కడి నుంచి మళ్లీ నేరుగా హైదరాబాద్ కి వెళ్లగా, అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ కి రావడం చంద్రబాబు 74వ సారని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. శనివారం రోజున రాత్రి పార్కు హయత్, ఆదివారం ఐటిసి కాకతీయ హోటల్, అలాగే అన్వయ కన్వెన్షన్ లో జరిగిన కార్యక్రమాలలో సైతం పాల్గొన్నారు. చంద్రబాబు ఎక్కువగా వీకెండ్ టూర్ లోనే ఉంటున్నారంటూ ప్రతిపక్ష నేతలు సోషల్ మీడియాలో వైరల్ గా చేస్తున్నారు. 2014 -19 మధ్యలో కూడా ఇలానే చేశారని, 2019లో అధికారం కోల్పోయిన కూడా ఇలానే వ్యవహరించారని ,ముఖ్యంగా కరోనా కష్ట సమయాలలో 2022 వరకు ఏపీ ప్రజలకు తన ముఖమే చూపించలేదని కేవలం హైదరాబాదులోనే ఉండిపోయారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి