బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అరాలో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలు  సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.  బీహార్ రాష్ట్ర ప్రజలు ఎన్డీయేతో ఉన్నారని మోడీ అభిప్రాయం వ్యక్తం చేశారు.  2026 సంవత్సరం సమయానికి కోటి కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామని మోదీ  చెప్పుకొచ్చారు.  ఇందుకు సంబంధించిన పూర్తి  రోడ్  మ్యాప్ ను సిద్ధం చేశామని ఆయన తెలిపారు.

ఇప్పటికే కోటీ 30 లక్షల మంది మహిళల ఖాతాలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున సహాయం చేశామని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తాన్ని  పెంచుతామని మోడీ పేర్కొన్నారు.  ఒక వైపు ఎన్డీఏ నిజాయితీ మేనిఫెస్టో మరోవైపు  కూటమి అబద్ధాల కట్ట ఉందని  ప్రజలు ఎటువైపో తేల్చుకోవాలని  మోడీ పిలుపునిచ్చారు.  మరోసారి ఎన్.డీ.ఏకు అవకాశం ఇవ్వాలని మోడీ చెప్పుకొచ్చారు.

అభివృద్ధి చెందిన బీహార్  మన దేశానికి పునాది అని  దీనికి మీ మద్దతు కోరుతూ  వచ్చానని మోడీ కామెంట్లు చేశారు.  రైతులకు పీఎం కిసాన్ ఇచ్చే 6000 రూపాయలకు అదనంగా మరో 3000 రూపాయలు ఇస్తామని ఆయన పేర్కొన్నారు.  దేశంలో ఎక్కువ మొత్తంలో జనాభా ఉన్న రాష్ట్రాలలో బీహార్ ఒకటి అని  బీహార్ ను మేడ్ ఇన్ ఇండియా కేంద్రంగా మార్చడమే లక్ష్యం అని ఆయన చెప్పుకొచ్చారు.

ఆర్జేడీ నాయకుడు సీఎం పదవిలో ఉండాలని కాంగ్రెస్ ఎప్పుడూ  కోరుకోదని  ఆయన చెప్పుకొచ్చారు.  బీహార్ లో 60 లక్షల పేద కుటుంబాలకు శాశ్వత గృహాలు అందించామని ఆయన తెలిపారు.  తాము ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని ఆయన పేర్కొన్నారు.  మోదీ  వెల్లడించిన విషయాలు  సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.  నరేంద్ర మోడీ రైతులకు మేలు చేసేలా తీసుకున్న నిర్ణయాలపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.  బీహార్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: