జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్ ఏకంగా 25 వేల ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ముందు నుంచి రాజకీయ వర్గాలు అధికార కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ ఉంటుందని భావించారు. కానీ కౌంటింగ్ లో మాత్రం తొలి రౌండ్ మినహా ప్రతి రౌండ్ లోను కాంగ్రెస్ దూసుకుపోయింది. బీఆర్ఎస్ మూడో రౌండ్లో స్వల్ప ఆధిక్యత్య సాధించగా తొలి రౌండులో కాంగ్రెస్కు 62 ఓట్ల మెజార్టీ వచ్చింది. కౌంటింగ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్‌కు 25 వేల ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇది ఇలా ఉంటే ఈ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద తనదైన మార్క్ రివెంజ్ తీర్చుకున్నారని తుమ్మల అనుచరులు చెబుతున్నారు.
వాస్తవానికి తెలంగాణలో 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అప్పుడు మంత్రిగా ఉండి పాలేరులో పోటీ చేసిన తుమ్మల నాగేశ్వర రావు ఓడిపోయారు. అయితే కేటీఆర్ కు సన్నిహితుడుగా ఉన్న పువ్వాడ అజయ్ కోసం కేటీఆర్ పాలేరులో తుమ్మలకు వ్యతిరేకంగా చక్రం తిప్పి ఓడించారని అప్పట్నుంచి తుమ్మల అనుచరులు భావిస్తున్నారు. ఆ ఎన్నికలలో తుమ్మలపై విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్రెడ్డి తర్వాత బిఆర్ఎస్లోకి వెళ్లిపోయారు. తుమ్మల ఓడిపోవడంతో ఐదేళ్లపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేటీఆర్ సన్నిహితుడుగా అజయ్ చక్రం తిప్పారు. ఆ ఐదేళ్లపాటు తుమ్మలకు గులాబీ పార్టీలో అస్సలు ప్రాధాన్యత లేకుండా పోయింది. ఇందుకు ప్రధాన కారణం కేటీఆర్ అని తుమ్మల అనుచరులు ముందు నుంచి ఆగ్రహంగా ఉన్నారు. గత ఎన్నికల్లోను తుమ్మలకు గులాబీ పార్టీలో సీటు లేకుండా కేటీఆర్ చేశారని చర్చ ఉంది. ఈ క్రమంలోనే మొన్న సాధారణ ఎన్నికలకు ముందు తుమ్మల కాంగ్రెస్ లోకి వెళ్లి ఖమ్మం నుంచి పోటీ చేసి కేటీఆర్ సన్నిహితుడు పువ్వాడ అజయ్‌ను చిత్తుచిత్తుగా ఓడించారు.
అనంతరం ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఇక తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నియోజకవర్గంలోని వెంగళరావు నగర్ డివిజన్ కు తుమ్మల మరో మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్ ఇన్చార్జిలుగా ఉన్నారు. తుమ్మల సీమాంధ్ర ఓటర్లతో పాటు కమ్మ సామాజిక వర్గాన్ని ఏకం చేసి కాంగ్రెస్‌కు అనుకూలంగా మళ్లించారు. అందుకే వెంగళరావు నగర్లో కాంగ్రెస్‌కు మంచి మెజార్టీ వచ్చింది. దీంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీసుకువచ్చి కమ్మ సామాజిక వర్గ పెద్దలు నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి వారిని కాంగ్రెస్ వైపు మళ్ళించేలా చేయడంలో పూర్తి సక్సెస్ అయ్యారు. అలా రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ మధ్య జరిగిన ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో వెంగళరావు నగర్ లో తుమ్మల తన చాణక్యం ఉపయోగించి పరోక్షంగా కేటీఆర్ పై తన రివెంజ్ తీర్చుకున్నారని.. తుమ్మల కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి