హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నెల్లూరు జిల్లాలోని వాకడలో ఉన్న ఆయనకు మెరుగైన చికిత్సను అందించడానికి చెన్నైకి తరలించారు. గత కొంత కాలంగా నేదురమల్లి అనారోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తనంతట తానుగా నడవలేని స్థితిలో ఉన్నట్లు ఇక్కడికి అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. తన స్వస్థలమైన వాకడలో ఉన్న నేదురమల్లి అస్వస్థతకు గురి కావడంతో ఆయన భార్య, మాజీ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మీ, మిగతా కుటుంబ సభ్యులు, సన్నిహితులు జనార్ధన్ రెడ్డిని చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు.
మరింత సమాచారం తెలుసుకోండి: