టీమిండియాలో యువ సంచలనంగా పృథ్వి షా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రారంభంలో ఎన్నో మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఫ్యూచర్ సచిన్ టెండూల్కర్ అంటూ ఎంతో మంది చేత ప్రశంసలు కూడా అందుకున్నాడూ. కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం నిలకడ లేమి కారణంగా టీమిండియాకు దూరమయ్యాడూ. ఎన్ని అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేక పోయాడు. ఇక ఇప్పుడు టీమిండియా లోకి రావడానికి పృథ్వి షా ఎంతగానో కష్టపడుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇటీవల సౌతాఫ్రికాతో టీమిండియా సొంతగడ్డపై ఆడుతున్న టీ20 సిరీస్ లో ఈ విషయాన్ని పృథ్వి షాను చేయలేదు.


 ఇక తాజాగా ఐర్లాండ్ తో ఈ నెల 26, 28 తేదీల్లో జరిగే రెండో టి20 మ్యాచ్  కోసం 17 మంది సభ్యులను ప్రకటించిన బీసీసీఐ పృథ్వి షాకు మాత్రం అవకాశం కల్పించలేదు. ఇక మొదటి సారి  హార్దిక్ పాండ్యా కు కెప్టెన్సీ అప్పగించింది అన్న విషయం తెలిసిందే. పృథ్వి షాకు టీమిండియాలో అవకాశం దక్కకపోవడంపై మాత్రం అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అన్నది తెలుస్తుంది. ఇటీవల జరిగిన ఐపీఎల్ లో పృథ్వి షా మంచి ప్రదర్శనే చేశాడు. డేవిడ్ వార్నర్ తో కలిసి ఢిల్లీకి మంచి ఆరంభం అందించాడు.


 అదే సమయంలో రంజీ ట్రోఫీలో ముంబై జట్టు కెప్టెన్ గా పృథ్వి షా జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పటికే సెమీస్కు చేరిన ముంబైకీ మరోసారి కప్పు అందించేందుకు సిద్ధమయ్యాడు. అలాంటి ఆటగాడిని జట్టులోకి తీసుకోకపోవడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. తరచు టీమిండియా ఆడుతున్న అన్ని సిరీస్ లకు పృథ్వి షాను పక్కన పెడుతూ ఉంటే అతనికి ఉన్న ఆత్మ విశ్వాసం దెబ్బతింటుంది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఐర్లాండ్ టూర్ కి పృథ్వీ షా ని ఎందుకు తీసుకోలేడదు. అతను చేసిన తప్పు ఏంటి ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తూ ఉండటం గమనార్హం. దీనిపై బిసిసిఐ ఏమి సమాధానం చెబుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: