
అయితే ఇక ఎంతో వేగంగా రోడ్డు పక్కన ఉన్న రైలింగ్ ను కారు ఢీ కొట్టిన నేపథ్యంలో ఇక మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది అన్నది తెలుస్తుంది. అయితే ఆ సమయంలో రిషబ్ పంత్ ఒక్కడే కారులో ఉన్నట్లు సమాచారం. ఇక రిషబ్ పంత్ తలకు తీవ్ర గాయాలు అయ్యాయట. అయితే స్థానికులు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తుంది. అయితే ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్తుండగా రూర్కి వద్ద ఇక ఈ ప్రమాదం జరిగిందట. ముందుగా స్థానికులు గమనించి స్థానిక ఆసుపత్రికి తరలించిగా ఇక వెంటనే సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అతన్ని ప్లాస్టిక్ సర్జరీ నిమిత్తం ఢిల్లీకి తరలించినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం బారిన పడి తీవ్ర గాయాల పాలయ్యాడు అన్న విషయం తెలిసి అభిమానులు అందరూ కూడా ఆందోళనలో మునిగిపోతున్నారు అని చెప్పాలి. రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని పూజలు సైతం చేస్తున్నారు అభిమానులు. అయితే ఇక ఇలా ఈ రోడ్డు ప్రమాదానికి వెనుక కేవలం అతివేగమే కారణమా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయో అనే విషయంపై కూడా పోలీసులు విచారణ జరిపే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఇకపోతే ఇటీవల టీమ్ ఇండియా తరఫున బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో రిషబ్ పంత్ మంచి ప్రదర్శన చేశాడు అన్న విషయం తెలిసిందే.