ఇటీవలే టీమిండియాలో స్టార్ క్రికెటర్గా కొనసాగుతున్న వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం బారిన పడిన విషయం కాస్త దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది అభిమానులు రిషబ్ పంత్ యాక్సిడెంట్ గురించి తెలిసి ఆందోళనలో మునిగిపోయారు. అయితే ఈ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఇక అతనికి కొన్ని సర్జరీలు కూడా జరిగినట్లు సమాచారం.


 ఇలా రిషబ్ పంత్ గాయాల బారిన పడి రోడ్డుపై పడిపోయిన సమయంలో.. సుశీల్ కుమార్ అనే బస్సు డ్రైవర్ ఇక పంతును కాపాడి అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించాడు అన్న విషయం తెలిసిందే.  ఇటీవల రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం బారిన పడిన సమయంలో ఏం జరిగింది అన్న విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు సుశీల్ కుమార్. ప్రమాదం జరిగిన కేవలం నిమిషాల వ్యవధిలోనే తాను కారు వద్దకు చేరుకొని ఇక కారులో ఇరుక్కుపోయిన రిషబ్ పంతును వెంటనే బయటకు తీసాను అంటూ సుశీల్ కుమార్ చెప్పుకొచ్చాడు.


 అయితే ఇలా కారు నుంచి బయటకు తీసే సమయానికి రిషబ్ పంత్ స్పృహలోనే ఉన్నాడు అన్న విషయాన్ని సుశీల్ కుమార్ తెలిపాడు.  ఇక ఆ సమయంలో కారులో మీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా అంటూ అడిగితే తాను ఒంటరిగానే వచ్చాను అంటూ చాలా కష్టంగా సమాధానం చెప్పాడు. అయితే మొబైల్ తీసి ఇవ్వాలని పంప్ సైగ చేశాడు. ఇక ఆ తర్వాత వెంటనే తన తల్లికి ఫోన్ చేయాలని అతి కష్టం మీద అస్పష్టంగా చెప్పాడు. కానీ అతని తల్లి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఇక వెంటనే తాను అంబులెన్స్ కి ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించాను అంటూ సుశీల్ కుమార్ చెప్పుకొచ్చాడు. ఇలా సహాయం చేసిన సమయంలో తనకు పంత్ ఎవరో తెలియదు అంటూ బస్ డ్రైవర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: